తమ గౌరవాన్ని కాపాడుకోవడమేనని అన్నారు. మహిళల జుట్టులోని కర్ణాటక ఆటగాళ్లు ఎం కె గౌతమ్ , చైత్ర బి పేర్కొన్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రపంచకప్ గెలిచి దేశ ప్రతిష్ఠను పెంచిన తమకు తగిన గుర్తింపు దక్కలేదని కర్ణాటక ఖోఖో ఆటగాళ్లు ఇద్దరు వాపోయారు. కర్ణాటక సీఎం సిధ్ధరామయ్య ప్రకటించిన బహుమతిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ముఖ్యమంత్రిని అవమానించడం కాదని, తమ గౌరవాన్ని కాపాడుకోవడమేనని అన్నారు. మహిళల జుట్టులోని కర్ణాటక ఆటగాళ్లు ఎం కె గౌతమ్ , చైత్ర బి పేర్కొన్నారు.
అసలు విజయాన్ని మరింత గౌరవంగా అంగీకరించాలని అన్నారు. తాము ఎంతో కష్టించి దేశ ప్రతిష్ఠ ను పెంచితే ..అంత తక్కువ బహుమతిని ఇచ్చి ఆటగాళ్లను తక్కువ చెయ్యడమే అని అన్నారు. మహారాష్ట్ర ఆటగాళ్లకు అక్కడి ప్రభుత్వం రూ. 2.25 కోట్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించిందని చెప్పారు.
కర్ణాటకలో మాత్రం ఆ స్థాయి గౌరవం దక్కడం లేదని వాపోయారు. ఈ విషయం పై మరోసారి నిర్ణయం తీసుకోవాలని కోరారు. మహిళల జట్టు సభ్యురాలు చైత్ర స్పందిస్తూ.. తాము కూడా ప్రపంచ కప్ గెలిచిన ఆటగాళ్లమే అయినా ఇతర క్రీడా జట్లకు లభించే గౌరవం దక్కడంలేదని వాపోయారు.