పంత్ క్రీజులో చాలా నిర్లక్ష్యంగా ఆడుతున్నాడట. అనవసరంగా వికెట్ ఇచ్చేస్తున్నాడని గావస్కర్ ఫుల్ ఫైర్ అయ్యారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: టీమ్ ఇండియా యంగ్ బ్యాటర్ రిషబ్ పంత్ పై మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ ఫైర్ అయ్యాడు. మెల్ బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇన్నింగ్స్ లో 37 బంతులు ఎదుర్కొన్న పంత్ 26 పరుగులు చేసి బోలాండ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అయితే పంత్ క్రీజులో చాలా నిర్లక్ష్యంగా ఆడుతున్నాడట. అనవసరంగా వికెట్ ఇచ్చేస్తున్నాడని గావస్కర్ ఫుల్ ఫైర్ అయ్యారు.
ఈ మ్యాచ్లో పంత్ రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 2 పరుగుల వద్ద క్యాచౌట్ నుంచి తప్పించుకున్న పంత్, తర్వాత జడేజాతో రన్ ఔట్ ప్రమాదం నుంచి కూడా బయటపడ్డాడు. ఇలా పంత్ కు ఈ ఇన్నింగ్స్ లో రెండు సార్లు లైఫ్ లభించింది . ఇక క్రీజులో సెట్ అయినట్టే కనిపించిన అతడు 55.4 వద్ద బోలాండ్ బౌలింగ్ లో అనవసరంగా స్కూప్ షాట్ అడి ధర్డ్ మ్యాచ్ ను చిక్కాడు. ఈ ఇన్సిడెంట్ తో అనవసరంగా ఆసీస్ కు వికెట్ ఇచ్చేశాడని కామెంటరీ బాక్స్ లో కూర్చొన్న గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
'స్టుపిడ్, స్టుపిడ్, స్టుపిడ్! అక్కడ ఇద్దరు ఫీల్డర్లు ఉన్నారు. అంతకు ముందు కూడా ఇలానే చేశావ్ . అక్కడ ఇద్దరు ఫీల్డర్స్ ఉన్నారు చూడలేదా.. నువ్వు డీప్ థర్డ్ మేన్ వద్ద క్యాచ్ అయ్యావు. భారత్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నువ్వు ఆ షాట్ ఆడాల్సింది కాదు. పరిస్థితులను అర్థం చేసుకుని ఆడడం ముఖ్యం. ఇది నీ నేచురల్ గేమ్ అని చెప్పకు. ఐయామ్ సారీ, ఇది నీ నేచురల్ గేమ్ అస్సలు కాదు. నువ్వు ఎంచుకున్నది అత్యంత తెలివితక్కువ షాట్. అది నీ జట్టును మరింత దెబ్బతిసింది' అని గావస్కర్ అన్నాడు.