2027 వరకు తటస్థ వేదికల్లో నిర్వహించాలని బీసీసీఐ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయించాయి. ఈ ట్రోఫీ మ్యాచ్ లన్నింటినీ దుబాయ్ లో ఆడుతుందని జమాన్ చెప్పారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ ఫఖర్ జమాన్ వరల్డ్ కప్ టైంలో తమ జట్టుకు లభించిన ఆతిధ్యం పై హర్షం వ్యక్తం చేశాడు . అసలు ఆ టైం ను చాలా ఎంజాయ్ చేశామని తెలిపారు. అంతేకాదు ఇండియాలో ఆడకపోవడం అనేది ఎప్పుడూ వెలితిగానే ఉంటుందని తెలిపాడు. కాగా, త్వరలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లను 2027 వరకు తటస్థ వేదికల్లో నిర్వహించాలని బీసీసీఐ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయించాయి. ఈ ట్రోఫీ మ్యాచ్ లన్నింటినీ దుబాయ్ లో ఆడుతుందని జమాన్ చెప్పారు.
మేము మొదటిసారి హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు స్థానికులు మాకు ఘన స్వాగతం పలికారు. వారందరూ మాపై ఎంతో ప్రేమను కురిపించారు. మేము వీటన్నింటినీ కచ్చితంగా కోల్పోతాం" అని ఫకర్ జమాన్ స్పోర్ట్స్ టాక్‌తో అన్నాడు. ఎందుకో ఇండియా జట్టు మాత్రం మా పాకిస్థాన్ కు రావడం లేదు . వస్తే మా దేశంలో తమను ఇష్టపడేవారు ఎంతో మంది ఉన్నారో తెలుస్తుంది. ఈ విషయంలో మాత్రం భారత్ మాకు ఎప్పుడు నిరాశే మిగులుస్తుంది. కానీ దుబాయ్ లో వారితో తలపడటాన్ని మేం సంతోషిస్తామని తెలిపారు జమాన్ . ఫిబ్రవరి 23న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పోటీపడనున్నాయి.