Virat Kohli: అనుష్క శర్మను ఉద్దేశించి ఇన్ స్టాలో కోహ్లీ ఆసక్తికర పోస్ట్

Published 2024-07-01 17:51:46

postImages/2024-07-01/1719836506_whyanushkasharmakeepsvamikaawayfromspotlight11704971387.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  టీమిండియా( team india)  స్టయిలిష్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ( virat kohli)   రీసెంట్ గా తన సోల్ మేట్ అనుష్క శర్మ( anushka sharma)  ను ఉద్దేశించి ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ వేశాడు. టీ 20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను( south africa)  ఓడించి టీమిండియా వరల్డ్ కప్ కొట్టింది. 


ఫైనల్లో కోహ్లీ చేసిన 76 పరుగులు ఎంత విలువైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కోహ్లీకే లభించింది. తన విజయం వెనుక ఉన్నది అనుష్క శర్మ ( anushka sharma) అని కోహ్లీ తన సందేశం ద్వారా వివరించాడు. నువ్వు నాకు సపోర్ట్ చెయ్యకపోతే నాకు ఈ విజయం సాధ్యమయ్యేదే కాదంటు...ట్విట్ చేశాడు.


"నా ప్రియతమా... నేను సాధించిన ఘనతలో ఏ కొద్ది భాగం కూడా నువ్వు లేకుండా సాధ్యం కాదు. నేను ఎలాంటి గర్వం లేకుండా, నిరాడంబరంగా ఉన్నానంటే అందుకు నువ్వే కారణం. సంపూర్ణమైన నిజాయతీ వల్లే ఇలా ఉండడం సాధ్యమవుతుందని నువ్వు ఎప్పుడూ చెబుతుంటావు. అందుకు నీకెన్ని కృతజ్ఞతలు చెప్పాలో! ఈ విజయం నాది మాత్రమే కాదు నీది కూడా. నువ్వు నువ్వుగా ఉన్నందుకు నిన్ను ప్రేమిస్తున్నాను... థాంక్యూ!" కొహ్లీ ట్విట్ చేశాడు. ఈ ట్విట్ కు నెటిజన్లు..తెగ ఫిధా అయిపోతున్నారు.