"అతడి పేరే స్వయంగా అన్ని విషయాలు చెబుతోంది. అతడిని అనుమానించేవాళ్లు ఎవరైనా ఉంటే వారు రెస్ట్ ఇన్ పీస్ కావొచ్చు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భారత్ ..ఆస్ట్రేలియా మధ్య ఫస్ట్ టెస్ట్ పెర్త్ వేదికగా రీసెంట్ గా జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ సూపర్ సెంచరీ బాదాడు. దీంతో అతడ ఫామ్ పై చాలా కామెంట్లు వస్తున్నాయి. దీని పై రియాక్ట్ అయ్యారు అజయ్ జడేజా. "అతడి పేరే స్వయంగా అన్ని విషయాలు చెబుతోంది. అతడిని అనుమానించేవాళ్లు ఎవరైనా ఉంటే వారు రెస్ట్ ఇన్ పీస్ కావొచ్చు.
ఆసీస్ బ్యాటర్లు మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ పేలవ ఫామ్ నుంచి బయటపడాలంటే ముందు తమ ఆటపై విశ్వాసంతో ఉండాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. జడేజా కూడా జీనియస్ లు రాత్రి కి రాత్రే పుట్టరని చెప్పుకొచ్చారు. అందుకు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఉదాహరణగా చూపించాడు.
విరాట్ కోహ్లీ తన ఆటపై నమ్మకముంచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో పూర్తి భిన్నమైన ఆటగాడిగా కనిపించాడు. తన బలంపై బాగా దృష్టిపెట్టాడు. స్మిత్ , లబుషేన్ కూడా తన దైన స్టైల్ లో ఆడతారు. ప్రతిసారి మీ అంచనాలకు మేం రావాలంటే అన్ని సార్లు కుదరకపోవచ్చు. పెర్త్ వేదికపై కొహ్లీ తన స్తా చాటారు ఇదెందుకు మీకు గుర్తు రావడం లేదంటూ కామెంట్ చేశాడు.