ఐఫోన్ 17 ప్రో మాక్స్ లో మోడల్స్ లో డైనమిక్ ఐస్ లాండ్ ఇంతకు ముందున్న ఐఫోన్స్ కంటే చిన్నగా హ్యాండీగా ఉంటుంది. స్లిమ్ గా కూడా ఉంటుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఐఫోన్ క్రేజ్ తెలిసిందేగా. డిజైన్ అప్ గ్రేడ్ తో పాటు ఎక్స్ క్లూజివ్ గా డిస్ ప్లేను మెరుగుపరుస్తుందని లీక్ ల ద్వారా తెలిస్తుంది. హైటాంగ్ ఇంటర్నేషనల్ టెక్ రీసెర్చ్ ఎక్స్ పర్ట్ జెఫ్ పు చెబుతున్న విషయాల ప్రకారం ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో మోడళ్లలో డైనమిక్ ఐస్‌లాండ్ ఇంతకు ముందున్న ఐఫోన్లకు ఉన్నదాని కంటే చిన్నగా ఉంటుంది. డైనమిక్ ఐస్ లాండ్ అంటే స్క్రీన్ పై భాగంలో ఉన్న పిల్ ఆకారపు ప్రాంతం . ఇది ఫ్రంట్ కెమరా ,ఫేస్ ఐడీ సెన్సార్లతో ఉంటుంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లో మోడల్స్ లో డైనమిక్ ఐస్ లాండ్ ఇంతకు ముందున్న ఐఫోన్స్ కంటే చిన్నగా హ్యాండీగా ఉంటుంది. స్లిమ్ గా కూడా ఉంటుంది.
ఐఫోన్ 17 సిరీస్‌లోని అన్ని మోడళ్లు ఒకేరకం డైనమిక్ ఐస్‌లాండ్‌తో వస్తాయని చెబుతున్నారు. ఆపిల్ కంపెనీకి ఐఫోన్ డిస్ ప్లేకు కొత్త మెటలెన్స్ టెక్నాలజీని యాడ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ డిస్‌ప్లే అప్‌గ్రేడ్ కేవలం ఐఫోన్ 17 ప్రో మాక్స్‌కు మాత్రమే రావచ్చని తెలుస్తోంది.చాలా సార్లు ఆపిల్ కెమెరా అప్‌గ్రేడ్లను ప్రత్యేకంగా ప్రో మాక్స్‌లోనే ప్రవేశపెట్టింది.
ఐప్యాడ్ ప్రో, ఫోల్డబుల్ ఐప్యాడ్ కూడా మెటలెన్స్ టెక్నాలజీతో వస్తాయని టిప్‌స్టర్ వెల్లడించింది. అయినప్పటికీ వాటిలో డైనమిక్ ఐస్‌లాండ్ లేదు. తిన్నర్ బెజెల్స్‌తో అవి రావచ్చు.