imanvi: అసలు నాకు పాకిస్థాన్ కు సంబంధమే లేదు ..నా పై ఎందుకు ఈ వ్యతిరేకత !


అయితే ఇమాన్వి ఈ విషయం పై రియాక్ట్ అయ్యారు. నేను ఇలాంటి వైలెన్స్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను.


Published Apr 24, 2025 02:44:00 PM
postImages/2025-04-24/1745486128_imanesmailimanviinprabhashanufilmasheroine.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : హను రాఘవపూడి డైరక్షన్ లో వస్తున్న సినిమాలో ఇమాన్వి ఇస్మాయిల్ అనే అమ్మాయిని ప్రభాస్ సినిమా లో హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే అయితే ఈ అమ్మాయి పాకిస్థాన్ కు చెందిన హీరోయిన్ అని తన తండ్రి గంలో పాకిస్తాన్ ఆర్మీలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారని వార్తలు చాలా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి కారణంగా ఇమాన్వి పాకిస్థాన్ కు చెందిన హీరోయిన్ కాబట్టి తనను ప్రభాస్ సినిమాల్లో తొలగించాలని సోషల్ మీడియా లో చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. 


అయితే ఇమాన్వి ఈ విషయం పై రియాక్ట్ అయ్యారు. నేను ఇలాంటి వైలెన్స్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అయితే తను పాకిస్థాన్ కు చెందిన అమ్మాయిని కాదని ..తన తండ్రికి పాకిస్థాన్ ఆర్మీతో సంబంధం లేదని తెలిపారు. తను ఇండో అమెరికన్ అని ..హిందీ, తెలుగు, గుజరాతి, ఇంగ్లీష్ మాట్లాడతానని తెలిపారు. నిజానికి ఇమాన్వి అమెరికా లాస్ ఏంజిల్స్ లో పుట్టినట్లు తెలిపారు. పేరెంట్స్ ఇద్దరు అమెరికన్ సిటిజన్స్ అని తెలిపారు. తన రక్తంలో భారతీయ వారసత్వముందని ..ఏ రకంగాను పాకిస్థాన్ తో తనకు సంబంధం లేదని తన మూలాలు కూడా భారతదేశానికి చెందినవే అని అన్నారు ఇమాన్వి. దయచేసి తప్పుడు ప్రచారాన్ని ఆపేయాలని కోరుతూ తన ఐండెంటిటీని పోస్ట్ చేశారు.
 

newsline-whatsapp-channel
Tags : prabhas newslinetelugu pakistan

Related Articles