INIDA: పాకిస్థాన్ పై భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకోబోతుంది !

భారత్ మాత్రం పాకిస్థాన్ పై  ఇప్పటికిపుడు ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రం మిస్రీ ప్రకటన చేశారు.


Published Apr 24, 2025 12:08:00 PM
postImages/2025-04-24/1745476827_wagahborderbeatingtheretreat650x40041474516120.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: గాయం ఎంత లోతుగా తగిలితే ..ప్రతీకారం అంత దారుణంగా ఉంటుంది. ఉగ్రవాదాన్ని ఉసిగొలుపుతుందని తెలిస్తేనే భారత్ ఊరుకోదు. అలాంటిది పాక్ ప్లాన్ చేసి భారత్ ప్రజలను చంపేస్తే ..భారత్ చూస్తూ ఊరుకోదు. పాకిస్థాన్ కు అష్టదిగ్భంధనం అంటే ఏంటో రుచి చూపిస్తుంది. ఇప్పటికే పాకిస్థాన్ భారత్ ఏం చర్యలు తీసుకుంటుందో తెలీక తలలు పట్టుకుంటున్నారు. భారత్ మాత్రం పాకిస్థాన్ పై  ఇప్పటికిపుడు ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రం మిస్రీ ప్రకటన చేశారు.


* ఒకటి సింధు జలాల ఒప్పందం నిలుపుదల. దీని వల్ల పాకిస్థాన్ చాలా నష్టపోతుంది.


* రెండు అటారీ బోర్డర్‌ మూసేస్తారు. కరెక్ట్ గా డాక్యుమెంట్స్ ఉన్నవారు భారత్ నుంచి మే 1వ తేదీ లోపు వెళ్లిపోవాలనే ఆదేశాలు జారీ చేసింది భారత్.


*మూడోది సార్క్‌ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్థాన్‌ జాతీయులకు భారత్‌లోకి ప్రవేశం నిషేధం. ఈ నిర్ణయం వల్ల గతంలో ఇచ్చిన వీసాలు కూడా రద్దు చేసింది.అంతేకాదు ఈ వీసా తో వచ్చిన వారు 48 గంటల్లో తిరిగి పాకిస్థాన్ కు వెళ్లిపోవాలనే అల్టిమేటం.


* నాలుగు భారత్‌లోని పాక్‌ హైకమిషన్‌లో ఉన్న సైనిక, వాయు, నౌకాదళ సలహాదారులు వారం రోజుల్లో దేశం నుంచి వెళ్లిపోవాలి. 


* ఆఖరిది..దౌత్యకార్యాలయాల్లో సిబ్బందిని 55 మంది నుంచి 30 మందికి తగ్గించారు.  మే 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 
వీటన్నింటిలో ఎక్కువగా పాకిస్థాన్ కు నష్టం కలిగించేది సింధు జలాల ఒప్పందం .  పాక్ పంటలకు సాగునీరు అందక చాలా ఇబ్బంది పడతారు. ఈ నిర్ణయం పాకిస్థాన్ ఆర్ధిక వ్యవస్థను మరింత దిగజారుస్తుంది.పాకిస్థాన్ లో ప్రజలు 45శాతం మంది ఉద్యోగాలు ఈ జలాలపైనే ఆధారపడి ఉన్నాయి. భారత్ ఇప్పటి వరకు ఆంక్షలు , నిషేధాలే చేసింది. కాని ఇప్పుడు మాత్రం రివైంజ్ తీర్చుకోబోతుంది. కేంద్రం చాలా సీరియస్ గా ఉంది. ఎట్టిపరిస్థితుల్లో ఈ విషయాన్ని లైట్ తీసుకోదు. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jammu-kashmir pakistan

Related Articles