సమయానికి స్టైఫండ్ ఇవ్వాలని, హాస్టల్స్ లో అన్ని రకాల వసతులు కల్పించాలని ఆందోళన చేపట్టారు. సర్కార్ దిగి వచ్చి తమ డిమాండ్లను నెరవేర్చేవరకు నిరసనలు విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఎలక్టివ్ సర్జరీలను బహిష్కరించారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (TJUDA) సభ్యులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ నెల 19న ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన డాక్టర్లు విధులకు హాజరవుతూనే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టారు.
ఉస్మానియా హాస్పిటల్ కు వెంటనే కొత్త బిల్డింగ్ నిర్మించాలని జూడాలు డిమాండ్ చేశారు. కాకతీయ మెడికల్ కాలేజీ క్యాంపస్‌లో ఇంటర్నల్ రోడ్ల సమస్య పరిష్కరించాలని, హాస్పిటల్ వద్ద మెరుగైన భద్రత ఏర్పాటు చేయాలని, MBBS సీట్లలో 15 % ఉమ్మడి కోటాను తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. సమయానికి స్టైఫండ్ ఇవ్వాలని, హాస్టల్స్ లో అన్ని రకాల వసతులు కల్పించాలని ఆందోళన చేపట్టారు. సర్కార్ దిగి వచ్చి తమ డిమాండ్లను నెరవేర్చేవరకు నిరసనలు విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఎలక్టివ్ సర్జరీలను బహిష్కరించారు.
దీంతో జూడాల సమ్మెపై స్పందించిన ప్రభుత్వం చర్చలకు పిలుపునిచ్చింది. వైద్య ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనరసింహ హామీతో జూడాలు సమ్మె విరమించినట్లు తెలుస్తోంది. జూడాల డిమాండ్లలో ఆరింటికి మంత్రి సానుకూలంగా స్పందించారు. దీంతో సమ్మెను విరమించి తిరిగి విధులను నిర్వహించేందుకు జూడాలు ఒప్పుకున్నారు.