Karimnagar: బండి సంజయ్ ఇంటి వద్ద ఉద్రిక్తత 2024-06-23 18:03:23

న్యూస్ లైన్ డెస్క్: కరీంనగర్‌(Karimnagar)లో ఉద్రిక్తత నెల కొంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bnadi sanjay) ఇంటిని విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. నీట్ పరీక్ష(NEET) రద్దుపై బండి సంజయ్ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఆందోళన చేపట్టారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జ్(Lathi charge) జరిపారు. ఈ సంఘటనలో పలువురికి సల్ప గాయాలు అయ్యాయి. విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి ఠాణకు తరలించారు.

 బండి సంజయ్ ఇంట్లో ఉన్న సమయంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బండి  ఇంటిని ముట్టడించడంతో ఉద్రిక్తత నెలకొంది. నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, NTA రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, నీట్ విద్యార్థుల పట్ల ప్రభుత్వ వైఖరినీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ నీట్ సమస్యపై మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ అదివారం ఉదయం విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటిని ముట్టడించారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ ఎఫ్, ఎన్ఎస్‌యూఐ, పిడిఎస్‌యూ, డివైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. బండి సంజయ్ నీట్ సమస్యపై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాదోపవాదాలు, తోపులాట లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.