తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు జిల్లా వాజేడు మండలంలోని తెలంగాణ నయాగరాగా పేరున్న బొగత జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుంది.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు జిల్లా వాజేడు మండలంలోని తెలంగాణ నయాగరాగా పేరున్న బొగత జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుంది. చీకుపల్లి వాగుకి వరద నీరు పోటెత్తడంతో బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది. జలపాతం అందాలను వీక్షించేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. జలపాతం వద్ద దుముకుతున్న తుంపర్ల జలదారలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో జల ప్రవాహం ఎక్కువగా ఉండి పర్యటకులకు కనువిందు చేస్తుంది. ఈ జలపాతాన్ని చూసేందుకు తెలంగాణ, ఛత్తీస్ గడ్, ఆంధ్ర, మహారాష్ట్ర నుంచి వచ్చిన టూరిస్టులతో బొగత నిండిపోయింది. కొత్త అందాలతో తెలంగాణ నయాగారా చూపరులకు ఎంతగానో కనువిందు చేస్తోంది. అయితే జలపాతం ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుండడంతో పర్యాటకులు లోతైన ప్రాంతాలకు వెళ్ళవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశం ఉండడంతో అనుమతించట్లేదని పోలీసులు పేర్కొన్నారు.