నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అల్లిపూర్ గ్రామ పంచాయితీ ఉద్యోగి 7 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఒత్తిడిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం విషాదకరం అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో ఆయా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి దరుణంగా మారింది. 9 నెలల నుంచి జీతాలు లేక కార్మికులు విలవిలలాడుతున్నారు. తమ కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక ఆత్మహత్యలకు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇక తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అల్లిపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఓ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. కాగా, ఈ ఘటనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అల్లిపూర్ గ్రామ పంచాయితీ ఉద్యోగి 7 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఒత్తిడిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం విషాదకరం అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతీ నెల మొదటి తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటే సరిపోదని అమలు చేసి చూపాలని ఆయన సవాల్ విసిరారు. గ్రామ పంచాయితీ పారిశుద్ధ్య ఉద్యోగుల జీతాల సమస్యను వెంటనే పరిష్కరించి, పెండింగ్ జీతాలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కార్మికులకు విజ్ఞప్తి చేశారు. పోరాడి, కొట్లాడి హక్కులు సాధించుకుందామని పారిశుద్ధ్య కార్మికులకు హరీష్ రావు పిలుపునిచ్చారు.