Uppal Mla: టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌పై ఎమ్మెల్యే ఫైర్

2024-07-02 09:12:31
postImages/2024-07-02/1719929499_uppalmla.PNG

న్యూస్ లైన్ డెస్క్: అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకట రమణపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్షా రెడ్డి ఫైర్ అయ్యారు. సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉప్పల్ బగాయత్‌లో పర్మిషన్లు ఎన్ని ఉన్నాయి? పర్మిషన్లు లేనివి ఎన్ని ఉన్నాయి? ఒక్క దాని పైన అయినా చర్య తీసుకున్నావా అని ఎమ్మెల్యే అధికారికి ప్రశ్నించారు. అయితే అలసత్వం వహిస్తున్న ఏసీపీ వెంకటరమణపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఒకరకంగా, పెద్దలకు ఒకరకంగా టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యవరిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. అక్రమ కట్టడాలపై టౌన్ ప్లానింగ్ అధికారుల అలసత్వానికి ఎమ్మేల్యే క్లాస్ తీసుకున్నారు. ప్రజలకు న్యాయం చేసే బాధ్యత అధికారులపై ఉంటుందని, వారికి న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యే సూచించారు.