TIRUPAATI REDDY: సీఎం అన్న చేతుల మీదుగా కల్యాణ లక్ష్మి చెక్కులు

సాధారణంగా ప్రభుత్వ పథకాల పంపిణీలో ప్రజాప్రతినిధులే పాల్గొని లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేయాలి. కానీ ఎలాంటి పదవి లేకుండా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్నారు. మంగళవారం తిరుపతి రెడ్డి తమ నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడంతో దౌల్తాబాద్ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ ఆయనపై మండిపడ్డారు. ఎలాంటి పదివి లేకున్నా కేవలం ముఖ్యమంత్రి అన్న అనే కారణంతో కల్యాణ లక్ష్మి చెక్కులు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. ప్రోటోకాల్ ప్రకారమే చెక్కులను పంపిణీ చేయాలని కోరారు.

Published Jun 25, 2024 08:18:59 AM
postImages/2024-06-25/1719311992_...jpg

సాధారణంగా ప్రభుత్వ పథకాల పంపిణీలో ప్రజాప్రతినిధులే పాల్గొని లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేయాలి. కానీ ఎలాంటి పదవి లేకుండా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్నారు. మంగళవారం తిరుపతి రెడ్డి తమ నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడంతో దౌల్తాబాద్ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ ఆయనపై మండిపడ్డారు. ఎలాంటి పదివి లేకున్నా కేవలం ముఖ్యమంత్రి అన్న అనే కారణంతో కల్యాణ లక్ష్మి చెక్కులు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. ప్రోటోకాల్ ప్రకారమే చెక్కులను పంపిణీ చేయాలని కోరారు.

తాము ఉన్నన్ని రోజులు ప్రోటోకాల్ పాటించాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన చెక్కులనే ఇస్తున్నారని, కానీ కాంగ్రెస్ హామీ ఇచ్చిన తులం బంగారం ఇవ్వడం లేదని మహిపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పక్కనే ఉన్నవాళ్లు జడ్పీటీసీ మహిపాల్‌ను బుజ్జగిస్తూ మీరు పంచండి అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ తిరుపతి రెడ్డి నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో నాకు తెలుసు..న్యూసెన్స్ చేయకు అంటూ హెచ్చరించారు.

అనంతరం ఆయనే మిగితా చెక్కులను సైతం పంపిణీ చేశారు. దీంతో సీఎం సోదరుడి తీరుపై నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఎలాంటి ప‌ద‌వి లేకున్నా చెక్కుల పంపిణీలో తిరుప‌తి రెడ్డి పెత్తనం ఏంటని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవ్వ‌డంతో నెటిజ‌న్లు సైతం మండిప‌డుతున్నారు. సీఎం ఫ్యామిలీ కుటుంబ రాజ‌కీయాలు చేస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

newsline-whatsapp-channel
Tags : cm-revanth-reddy

Related Articles