ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్నికల ముందు ప్రకటించిన ఉత్తుత్తి చైర్మన్ నియామకాలు పక్కనపెట్టి కొత్త నియామకాల కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, నామినేటెడ్ పోస్టులు, మంత్రి వర్గ విస్తరణ అంశాలపై సీఎం అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉంది. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి గల కారణాలపైనా పార్టీ పెద్దలు ఆరా తీస్తారని సమాచారం. సీనియార్టీ ప్రాతిపదికన కాకుండా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పనితీరు ఆధారంగా పోస్టులను భర్తీ చేయాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నట్టు తెలిసింది. తమతో చర్చించకుండానే నామినేటెడ్ పోస్టులు ప్రకటించారని మంత్రులు, ఎమ్మెల్యేలు కొందరు సీఎం రేవంత్ పై అధిష్ఠానంతో ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసకుంటుందనేది చర్చనీయంశంగా మారింది.