హుసైని ..ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, నటుడు పవన్‌కల్యాణ్‌కు హుసైని మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్‌లో శిక్షణ ఇచ్చారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పవన్ కళ్యాణ్ గురువు , కోలీవుడ్ యాక్టర్ షిహాన్ హుసైని కన్నుమూశారు. బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న హుసైని చెన్నైలోని హాస్పటిల్ లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. హుసైని ..ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, నటుడు పవన్‌కల్యాణ్‌కు హుసైని మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్‌లో శిక్షణ ఇచ్చారు.
అయితే షిహాన్ హుసైని 1986 లో రిలీజ్ అయిన పున్నగై మన్నన్ సినిమా ద్వారా తమిళ్ ఇండస్ట్రీ కి పరిచయమ్యారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించిన హైసైని విజయ్ హీరోగా నటించిన బద్రి సినిమా చాలా గుర్తింపునిచ్చింది. ఆర్చరీలోనూ హుసైని మంచి శిక్షకుడు . ఆయన ఆ రంగంలో 400మందికి పైగా విద్యార్ధులను తయారుచేశారు.