Farmer: పార్టీలో చేరలేదని.. పంట నష్టం చేసిన కాంగ్రెస్ నాయకులు

రోజురోజుకు కాంగ్రెస్ నాయకుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరలేదని రైతు బత్తాయి మొక్కలను కాంగ్రెస్ నాయకులు నరికివేశారు.


Published Jul 24, 2024 08:15:39 AM
postImages/2024-07-24/1721825451_goons.PNG

న్యూస్ లైన్ డెస్క్: రోజురోజుకు కాంగ్రెస్ నాయకుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. రైతుల భూములు కబ్జా చేసిన గోస పెడుతున్నారు. తాజాగా మరో ఘన వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో చేరలేదని రైతు బత్తాయి మొక్కలను కాంగ్రెస్ నాయకులు నరికివేశారు. ఈ ఘటన నాగార్జునసాగర్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది.

పెద్దవూర మండలం గేమ్య నాయక్ తండా గ్రామానికి చెందిన రమావత్ సీతారాం భార్య పేరు మీద 2 ఎకరాల 20 గుంటల భూమిలో వేసిన 300 బత్తాయి మొక్కలను వేసాడు. అయితే తను వేరే పార్టీ వాడని కాంగ్రెస్ పార్టీలో చేరలేదని తను మూడు సంవత్సరాలుగా పెంచుతున్న బత్తాయి మొక్కలను కాంగ్రెస్ నాయకులు నరికి వేసారని మొరపెట్టుకున్నాడు. ఈ పంట మీద ఆధారపడి ఉన్నాను, రెండు సార్లు పంట వేసిన నష్టాం వచ్చిందని వాపోయాడు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాహయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దారుణానికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

newsline-whatsapp-channel
Tags : telangana congress cm-revanth-reddy farmer

Related Articles