కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి విపత్తు సంభవించిన ప్రాంతాన్ని గురువారం రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు పరిశీలించారు.
న్యూస్ లైన్ డెస్క్: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 288కి చేరుకుంది. ఈ నేపథ్యంలో కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి విపత్తు సంభవించిన ప్రాంతాన్ని గురువారం రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు పరిశీలించారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెనల పైనుంచి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. సహాయక చర్యల గురించి ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మెప్పాడిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో బాధితులను కలుసుకున్నారు. అక్కడ నుంచి డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీకి వెళ్తున్నారు. మెప్పాడీలో రెండు రిలీఫ్ క్యాంప్‌లు ఉన్నాయి. రాహుల్, ప్రియాంకాలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా పర్యటించారు.