Google Maps: గూగుల్‌ మ్యాప్స్‌ లో... ఏఐ ఫీచర్స్‌

ఫోర్ వీలర్స్ లో ప్రయాణించే సమయంలో కొన్ని దారుల్లో కార్లు ఇరుక్కుపోతుంటాయి. అయితే ఇలాంటి సమస్యకు చెక్ పెట్టడానికి మ్యాప్స్ కొత్త ఫీచర్లను తీసుకొచ్చారు.


Published Jul 26, 2024 07:03:52 AM
postImages/2024-07-26/1721994021_narrowroad.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇప్పుడు రోడ్లమీద దారి చెప్పే జనాలు కరువైపోయారు. అంతా గూగుల్ మాయ..గూగుల్ ఏ ఏట్లోకి తీసుకెళ్తే...ఆ రూట్లో అలా వెళ్లిపోవడమే..ఇక పై గూగుల్ మ్యాప్స్ ను ఓపెన్ చెయ్యడం ..మ్యాప్స్ లో డెస్టినేషన్  పెట్టుకొని వెళ్తుపోతుంటాం. అయితే ఫోర్ వీలర్స్ లో ప్రయాణించే సమయంలో కొన్ని దారుల్లో కార్లు ఇరుక్కుపోతుంటాయి. అయితే ఇలాంటి సమస్యకు చెక్ పెట్టడానికి మ్యాప్స్ కొత్త ఫీచర్లను తీసుకొచ్చారు.


గూగుల్‌ మ్యాప్స్‌లో 'న్యారో రోడ్‌' అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇందులో శాటిలైట్ చిత్రాలు , స్ట్రీట్ వ్యూతో పాటు ఏఐ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ ఫీచర్ ఇరుకు రోడ్లను గుర్తిస్తుంది. మనం జర్నీ చేస్తున్నపుడు  రోడ్ పై నారో రోడ్ ఆప్షన్ ఉందో లేదో చెప్తుంది. దీంతో మీరు ఫోర్‌ వీలర్‌ ఉపయోగిస్తుంటే వెంటనే సెకండ్ రూట్ ఆప్షన్ తీసుకోవచ్చు.


ఇక ఫ్లై ఓవర్‌ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సాధారణంగా మార్గ మధ్యంలో ఫ్లైఓవర్‌ వస్తే పైకి ఎక్కాలా.? కింది నుంచి వెళ్లాలా అనే సందేహం వస్తుంది. అయితే ఈ డౌట్ లో ఏఐ మీకు హెల్ప్ చేస్తుంది. మీరు వెళ్లాలనుకున్న రోడ్ క్రిస్టల్ క్లియర్ గా ప్లాన్ చేస్తుంటుంది. టేక్‌ ఫ్లై ఓవర్‌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ దేశంలోని 40 ప్రధాన నగరాల్లో అందుబాటులోకి వచ్చేసింది. 


మార్గ మధ్యంలో ఫ్లైఓవర్‌ వస్తే వెంటనే యూజర్లను అలర్ట్‌ చేస్తుంది. ఒకవేళ ఫ్లైఓవర్‌ పై నుంచి వెళ్లాల్సి ఉంటే. టేక్‌ ఫ్లై ఓవర్‌ అనే సూచిక కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ దేశంలోని 40 ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంది.
మరో ఆప్షన్ ఏంటంటే ...మ్యాప్స్‌లో మెట్రో టికెట్లను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను కొచ్చి, చెన్నై  లాంటి మెట్రో సిటీస్ లో  తీసుకువచ్చారు. మెల్లగా అన్ని స్టేట్స్ లోను స్టార్ట్ చేస్తారు.


ఇక ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉపయోగించే వారి కోసం గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్స్ తో ఈవీ స్టేషన్స్ ఎక్కడున్నాయో గూగుల్ ఏఐ చెప్పేస్తుంది. . మ్యాప్స్‌లో ఛార్జింగ్ స్టేషన్స్‌తో పాటు ..మీరు స్టే చేయడానికి అనువైన ప్లేసులు కూడా ఎక్కడున్నాయో చెప్పేస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu artificial-intelligence

Related Articles