Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

Published 2024-07-05 17:58:35

postImages/2024-07-05/1720182515_rainshyd.webp

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ భారీ వర్షం కురుస్తోంది. వాతావరణ మార్పులతో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రాబోయే వారం రోజులపాటు రాష్ట వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణశాఖ హెచ్చ‌రించింది. ఇక కాప్రా, ద‌మ్మాయిగూడ‌, ఈసీఐఎల్, నేరెడ్‌మెట్‌, ఉప్ప‌ల్, కొంప‌ల్లి, జీడిమెట్ల‌, దుండిగ‌ల్, జ‌గ‌ద్గిరిగుట్ట‌, కూక‌ట్‌ప‌ల్లి, ప‌టాన్‌చెరు, మియాపూర్, బేగంపేట్‌, ముషీరాబాద్‌, ఓయూ, తార్నాక‌, సరూర్‌న‌గ‌ర్‌, హయత్ నగర్, ఎల్బీనగర్, రామంతాపూర్, కుషాయిగూడ, జవహర్నగర్, మేడ్చల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్పేట, కుత్బుల్లాపూర్, కూకట్పల్లిలో భారీ వర్షం కురుస్తోంది. వారంరోజులపాటు భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.