postImages/2024-07-02/1719926257_tarakktr.webp

KTR: సీఎస్ తక్షణమే జోక్యం చేసుకోవాలి

2024-07-02 18:47:37

న్యూస్ లైన్ డెస్క్:  ప్ర‌భుత్వ వెబ్‌సైట్లతోపాటు సోష‌ల్ మీడియా హ్యాండిల్స్‌లో ముఖ్య‌మైన స‌మాచారం అదృశ్యం కావ‌డంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి జోక్యం చేసుకోవాల‌ని కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని పేర్లు, ఫోటోలను మార్పు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ డేటాను కూడా తొలగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ప్ర‌భుత్వ వెబ్‌సైట్లలో పేర్లు మార్పు చేశారు. అయితే ఈ అంశంపై కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్య‌మైన కంటెంట్‌ను ఆర్కైవ్స్‌లో భ‌ద్ర‌ప‌ర‌చాలని. కానీ ఇలా తొల‌గించ‌డం స‌రికాదన్నారు. ఈ విలువైన ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడాన్ని భావి తరాలు క్షమించవు అన్నారు. కాబ‌ట్టి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి త‌క్ష‌ణ‌మే స్పందించి, ఈ విలువైన స‌మాచారాన్ని కాపాడే బాధ్య‌త తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏయే వెబ్‌సైట్లు, సోష‌ల్ మీడియా ఖాతాలు తొల‌గించారు. అనే వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే మీకు పంపిస్తానాని, ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని ఆశిస్తున్నాన‌ని కేటీఆర్ పేర్కొన్నారు.