maheshbabu: ఇండస్ట్రీ లో మహేష్ బాబు కు పాతికేళ్లు ..!

హేష్ బాబు. ఇన్నాళ్లయినా ...90 కిడ్స్ నుంచి 21 కిడ్స్ కూడా మహేష్ పేరులో ఏదో వైబ్రేషన్ ఉందనే అంటున్నారు. అది మహేష్ బాబు ఫేస్ లో ఉన్న మాయ. 


Published Jul 30, 2024 02:10:13 AM
postImages/2024-07-30/1722323243_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మహేష్ ...ఎంతో మంది లేడీ ఫ్యాన్స్ ఉన్న జెంటిల్ మ్యాన్. డీసెంట్ అంటే మామూలు డీసెంట్ కాదు. కృష్ణ గారు ఎంత ఫేమస్ అయ్యారో ..అంతకు డబుల్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు మహేష్ బాబు. ఇన్నాళ్లయినా ...90 కిడ్స్ నుంచి 21 కిడ్స్ కూడా మహేష్ పేరులో ఏదో వైబ్రేషన్ ఉందనే అంటున్నారు. అది మహేష్ బాబు ఫేస్ లో ఉన్న మాయ. 


తండ్రి సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంతో ఇండస్ట్రీ కి వచ్చినా … చిన్ననాటి నుంచే కెమెరా ముందు యాక్ట్ చేసి ఘట్టమనేని అభిమానులకే కాదు ...యూత్ ఫుల్ హీరో అయ్యాడు. ఫస్ట్ సినిమా రాజకుమారుడు ...సూపర్ డూపర్ హిట్టు.  ఆ తర్వాత ...హిట్లు ..ఫ్లాపులు ఏవీ ఆయన గ్లామర్ ను ఫేమ్ ను కదల్చలేకపోయాయి. హిట్లు పడినపుడు ఎంత హుందాగా ఉంటాడో..ఫ్లాపులకు అంతే హుందాగా ఉంటాడు. అయితే ఇండస్ట్రీకి మహేష్ బాబు వచ్చి కరెక్ట్ గా పాతికేళ్లు అయ్యింది.
1999 నుంచి రాజకుమారుడు, యువరాజు, మురారి లాంటి మంచి హిట్లతో, టక్కరిదొంగ తో కష్టపడినా ఫలితం అనుకూలంగా రాలేదు. 2003 సంక్రాంతికి గుణ శేఖర్ డైరెక్షన్లో వచ్చిన ఒక్కడు మహేష్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఆరోజుల్లో చాలా సెంటర్స్ లో టౌన్ రికార్డ్స్ క్రీస్తే చేసింది ఒక్కడు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా నేటికీ ఒక ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలిచింది. వచ్చే ఆగష్టు 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను మల్లి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు అభిమానులు. ఈ సారి బ్లాక్ బాస్టర్ చేసేసేలా ఉన్నారు ఫ్యాన్స్.


2006 సమ్మర్ సెన్సషన్ పోకిరి గురించి వేరే చెప్పక్కర్లేదు. సినిమా అంతా ఒకెత్తు...జస్ట్ క్లైమాక్స్ భయ్యా ...మతి పోతుంది ఆ క్లైమాక్స్ చూసి ...ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత మహేష్ వెంట కార్పొరేట్ బ్రాండ్స్ పడ్డాయి. థమ్స్ అప్, ఐడియా లాంటి కార్పొరేట్ బ్రాండ్స్ కు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఇప్పుడు మహేష్ కు సినిమాల కంటే యాడ్సే ఎక్కువ మనీ తెచ్చిపెడుతున్నాయి.


పోకిరి తరువాత కొన్ని సినిమాలు నిరాశ పరిచాయి. తరువాత దూకుడు, బిజినెస్ మేన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హిట్స్ గా నిలిచాయి.. 1 నేనొక్కడినే ప్లాప్ అయినా ఈ సినిమాకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. శ్రీమంతుడు, భారత్ అనే నేను, మహర్షి మంచి హిట్స్ గ నిలిచాయి. ఈ మూడు చిత్రాలకు మంచి వసూళ్లు మాత్రమే కాకుండా మహేష్ కు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి.


తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంచి మార్కెట్ ఉన్నా మహేష్ ఇప్పటివరకూ పాన్ ఇండియాకు వెళ్ళలేదు. రాజమౌళితో పాన్ వరల్డ్ కు ప్లాన్ చేస్తున్నాడో ఏమో తెలీదు కాని మహేష్ కి కాని ఆ రేంజ్ హిట్టు పడితే ...గ్లామర్ , మార్కెట్ , నేమ్ , ఫేమ్ అన్నీ ...టాలీవుడ్ చుట్టు చక్కర్లు కొడతాయి. 25 ఏళ్ళ ప్రస్థానం లో హిట్లు, ప్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు మహేష్ బాబు. హిట్టు, ఫ్లాపులు ఏదైనా ...మహేష్ బాబు రేంజ్ మాత్రం తగ్గదు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movies maheshbabu,

Related Articles