GOLD : భారీగా పెరిగిన పసిడి ధరలు ..వెండి రేటు ఆల్ టైం రికార్డు

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,260కి చేరువైంది. ఇప్పుడు గ్రాము ధఱ 7350 రూపాయిలు గా అమ్ముతున్నారు. 


Published Aug 29, 2024 06:51:00 AM
postImages/2024-08-29/1724894546_gold.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగారం ధర రోజు తగ్గుతున్నట్లే ఉంది. కొనడానికి మాత్రం చుక్కలు చూపిస్తుంది. పావలా తగ్గుతుంది...రెండు రూపాయిలు పెరుగుతుంది. తప్పదు బంగారం కదా...శుభకార్యాలు నడుస్తున్నాయి. బంగారం కొనేవాళ్లు ఎక్కువవుతున్నారు. ఇలాంటి టైంలో పావలా తగ్గినా తగ్గడమే. గురువారం ఉదయం  6 గంటలకు నిన్న బంగారంరేటు కంటే గ్రాము బంగారానికి 10 రూపాయిలు పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,260కి చేరువైంది. ఇప్పుడు గ్రాము ధఱ 7350 రూపాయిలు గా అమ్ముతున్నారు. 


ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67 వేల 900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73 వేల 260 వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి.


చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66 వేల 930, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73 వేల 260 రూపాయిలుగా కొనుగోళ్లు జరుగుతున్నాయి.


ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66 వేల 1030కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.73 వేల 020గా ఉంది.


బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66 వేల 1030కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73 వేల 260 వద్ద నడుస్తుంది.


తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66 వేల 1030కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 73 వేల 020 వద్ద కొనసాగుతోంది. ఏపీలోని విజయవాడతో పాటు, విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.


ఇప్పుడు బంగారం ధరతో ఈక్వల్ గా వెండి ధరలు నడుస్తున్నాయి. బుధవారం కిలో వెండి రూ.100 పెరిగింది. ఢిల్లీ, కోల్‌కతా, పుణె, ముంబయి తదితర నగరాల్లో కిలో వెండి రూ. 88 వేల 600 వద్ద కొనసాగుతోంది. అయితే దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో అత్యధికంగా రూ. 93 వేల 600 పలుకుతోంది. కాస్త తగ్గడం బెంగుళూరులో మాత్రమే నాలుగు వందలు కేజీ మీద మిగులు కనిపిస్తుంది. 


ప్లాటీనం ధరలు ఇలా..


దేశంలో ప్లాటీనం రేట్లు గురువారం పడిపోయాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 20 తగ్గి రూ. 25,690కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,710గా ఉండేది. హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,690గా ఉంది. ఇక అన్ని తెలుగు రాష్ట్రాల్లోను ఇదే రేట్లు నడుస్తున్నాయి.
 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu business goldrates silver-rate

Related Articles