ఆ ఐస్ క్రీమ్ ను తయారు చేసిన ఐస్‌క్రీం( ice cream) ఫ్యాక్టరీని గుర్తించారు. ఈ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పూణేలో( pune) ఉంది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని విచారించగా.. రెండ్రోజుల క్రితం ఇక్కడ పనిచేస్తున్న ఓ వ్యక్తి వేలు కట్ అయినట్లు గుర్తించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఓ 15 రోజుల క్రితం ముంబై ( mumbai) లో ఓ డాక్టర్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తే ..అందులో మనిషి వేలు కనిపించింది. అప్పుడు సోషల్ మీడియా( social media) లో రచ్చరచ్చ లేపారు. అయితే ఆ వేలు ఎవరిదో తెలిసిపోయింది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ ఐస్ క్రీమ్ ను తయారు చేసిన ఐస్‌క్రీం( ice cream) ఫ్యాక్టరీని గుర్తించారు. ఈ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పూణేలో( pune) ఉంది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని విచారించగా.. రెండ్రోజుల క్రితం ఇక్కడ పనిచేస్తున్న ఓ వ్యక్తి వేలు కట్ అయినట్లు గుర్తించారు. ఐస్ క్రీమ్ లో కనిపించిన తెగిన వేలు ఆ ఉద్యోగిదేనని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగి డీఎన్‌ఏ( dna) శాంపిల్ ను పరీక్షల నిమిత్తం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పూణేలో( pune) ఉంది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని విచారించగా.. రెండ్రోజుల క్రితం ఇక్కడ పనిచేస్తున్న ఓ వ్యక్తి వేలు కట్ అయినట్లు గుర్తించారు.ఇప్పటికే ఉద్యోగి డీఎన్‌ఏ శాంపిల్ ను పరీక్షల నిమిత్తం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ నివేదిక త్వరలో వెలువడనుంది. అప్పుడు తెగిపడిన వేలు ఫ్యాక్టరీ ఉద్యోగిదా కాదా అనేది తెలుస్తుంది. తెలిస్తే ఏం జరుగుతుందంటారేమో...ఫ్యాక్టరీ పై కేసు ఫైల్ చేస్తారు. నిర్లక్ష్యం గా వ్యవహరించినందుకు గాను ఫైన్ వేస్తారు. అయితే ఇప్పటికి ఐస్ క్రీమ్ లో వేలు మాత్రం ..ఉద్యోగిదే..అనే నిజం భయటపడింది. చర్యలు ఏం తీసుకుంటారో చూడాలి.