ఓ 17 ఏళ్ల అమ్మాయి హెరాయిన్ కు బానిసై డ్రగ్స్ కోసం డబ్బులు ఎవరిస్తారో వారితో శారీరక సంబంధం పెట్టుకుంది
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ ఓ టీనేజ్ అమ్మాయి ద్వారా 19 మందికి ఎయిడ్స్ సోకింది. ద న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ద్వారా ఈ విషయం బయటపడింది ఓ 17 ఏళ్ల అమ్మాయి హెరాయిన్ కు బానిసై డ్రగ్స్ కోసం డబ్బులు ఎవరిస్తారో వారితో శారీరక సంబంధం పెట్టుకుంది. దీనితో ఆమె ద్వారా దాదాపు 19 మంది ఎయిడ్స్ బారిన పడ్డారు. ఆ అమ్మాయి తెలిసే చేసిందా లేక ...తెలీయక జరుగుతుందా అనేది కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
యువకులు అనారోగ్యం బారినపడడంతో ఆసుపత్రిలో చేరారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో వారికి హెచ్ఐవీ సోకినట్టు గుర్తించారు. ప్రస్తుతం వారికి ట్రీట్మెంట్ తో పాటు కౌన్సిలింగ్ కూడా నడుస్తుంది. డ్రగ్స్‌కు బానిసైన యువతికి డబ్బులు సాయం చేసిన యువకులు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నారని, వీరు కాకుండా మరెంతోమంది ఆమె దగ్గర ఎయిడ్స్ బారినపడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అయితే ఆ అమ్మాయి మాత్రం డ్రగ్స్ కు బానిసై కౌన్సిలింగ్ కు సపోర్ట్ చెయ్యడం లేదని అంటున్నారు అధికారులు.
నైనిటాల్‌లో ఒక్కసారిగా హెచ్ఐవీ కేసులు పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏడాదికి దాదాపు 20 హెచ్ఐవీ పాజిటివ్ కేసులను గుర్తిస్తున్నామని, కానీ, కేవలం 5 నెలల్లోనే 19 కేసులు వెలుగు చూడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని నైనిటాల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ హరీశ్ చంద్ర పంత్ తెలిపారు. ఈ 17 నెలల్లో ఏకంగా 45 మంది ఎయిడ్స్ బారిన పడ్డారని ..పరిస్థితి ఇలానే ఉంటే ఎయిడ్స్ కేసులు అదుపు చెయ్యడం కష్టమవుతుందని అంటున్నారు అధికారులు.