Pak Female Journalist: పాకిస్థాన్ లో లైవ్ రిపోర్టింగ్‌.. మహిళా జర్నలిస్టు కష్టాలు చూడండి !

Published 2024-07-03 17:27:53

postImages/2024-07-03/1720007873_womanjournalistbullattack.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : హా...ఈ మీడియా వాళ్లకి పని లేదు...వీళ్లు ఎలా వస్తారు...అబ్బా రిపోర్టర్లు...ఇలా నీరసం మాటలు మాట్లాడతారు కాని ...జనాలకు ఎంతో కొంత కొత్త కంటెంట్ చూపించాలనే ఆత్రం వాళ్లది..మీడియా కష్టాలు ఎవ్వరికి తెలుస్తాయి. అంతే సీత బాధ సీతది పీత బాధ పీతది..పాకిస్థాన్ లో ఓ స్పెషల్ స్టోరీ కోసం ..లైవ్ రిపోర్టింగ్ కు వెళ్లింది ఓ లేడీ జర్నలిస్ట్.  

పాపం ..పాకిస్థాన్ ( pakistan) లో ఆర్ధిక మాంధ్యం సంగతి అందరికి తెలిసిందే కదా...చాలా రోజుల తర్వాత అసలు ఎద్దుల జంట రేటు ఎలా ఉందనేది ఆవిడ కాన్సప్ట్ . దీంతో డైరక్ట్ గా లైవ్ రిపోర్టింగ్ ( live reporting)  చేస్తూ ..రైతులతో మాట్లాడిస్తూ ఓ స్టోరీ వేద్దామనుకుంది. రిపోర్టింగ్ స్టార్ట్ చేద్దామని ...మైక్ , కెమరా అన్ని సెట్ చేసుకునే వరకు బానే ఉంది. స్టార్ట్ చెప్పి స్టోరీ లోకి వెళ్లే సరికి పక్కనే ఉన్న ఎద్దు ( bull) ఆమె పైకి అమాంతం ఎగిరిపడింది. పిల్ల భయంతో వణికి పోయిందనుకొండి.

వ్యాపారులు ఎద్దుల జంటలను రూ. 5 లక్షల కంటే తక్కువకు అమ్మేందుకు సిద్ధంగా లేరని ఆమె చెబుతుండగానే వెనక నుంచి వచ్చిన ఎద్దు కుమ్మి పడేసింది. ఆమె కేకలు వేస్తూ అంత దూరాన పడింది. చెల్లాచెదురుగా పడిన ఆమె మైక్రోఫోన్, మైక్ ను తీసుకొచ్చిన ఓ వ్యాపారి ఆమెకు అందించాడు. ఇక వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. మిలియన్ల వ్యూస్ తో పాటు లైకులు , షేర్లు వస్తున్నాయి. జస్ట్ మిస్ మీరే ఓ స్టోరీ అయిపోయేవారు అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.