Common Cobra: పాపం ..ఎంత పామైనా ..దానిది ప్రాణమేగా !

Published 2024-07-05 15:29:49

postImages/2024-07-05/1720173589_CobraCoughSyrumBottle1200x900.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : మింగలేక, కక్కలేక తెగ ఇబ్బందిపడిన  పాము వీడియో ఒకటి ఫుల్ వైరల్ అవుతుంది. స్నేక్ హెల్ప్ లైన్ వాలంటీర్లు రిస్క్ తీసుకొని మరీ ఆ పామును కాపాడారు. మనం చెత్తబుట్టలో చాలా వస్తువులు పడేస్తుంటాం. కాని ..అవి మరో జంతువుకు కాని మనుషులకు కాని హాని చేస్తాయనే ఆలోచనమాత్రం చెయ్యం. సేమ్ ఇలానే చెత్తలో ఉన్న దగ్గుటానిక్ ..బాటిల్ ను ఓ పాము మింగేసింది. ఇంతకీ ఎక్కడ జరిగిందంటే ..


‘భువనేశ్వర్ లో కామన్ కోబ్రా రకం పాము దగ్గు మందును మింగాలని చూసి చివరకు కక్కలేక ఇబ్బందిపడింది. స్నేక్ హెల్ప్ లైన్ వాలంటీర్లు రిస్క్ తీసుకొని పామును కాపాడారు. దాని కింది దవడను నెమ్మదిగా వెడల్పు చేయడం ద్వారా సీసాను కక్కేలాగా చేసి ఒక విలువైన ప్రాణాన్ని కాపాడారు’ అని నందా ఆ వీడియో పోస్ట్ కింద క్యాప్షన్ పెట్టారు. 


పాము ఆ సీసాను ఆహారంగా పొరబడటం వల్లే ఆ పాము సీసాను మింగింది వైల్డ్ లైఫ్ హెల్పర్స్ తెలిపారు . సీసా నోట్లో ఇరుక్కోవడం వల్ల ఆ పాము నొప్పితో బాధపడింది. దీనివల్ల అది చాలా నీరసించింది. నోట్లోంచి సీసా బయటకు వచ్చేశాక ఆ పామును అడవిలో విడిచిపెట్టామని తెలిపారు. దయచేసి చెత్తను పడేసేటపుడు పనికి రాని చెత్తను రీసైక్లింగ్ చేయగలిగే చెత్తను వేరు వేరుగా పెట్టాలని కోరారు.