Melkumjan: విమానం గాల్లో ఉండగా పై కప్పు ఎగిరిపోతే .. వామ్మో ఊహించడమే కష్టం ! 2024-06-26 12:25:03

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సగం జనాలకు విమానం( flight) గాల్లో కుదుపులు వస్తేనే ప్రాణం పోయేంత భయపడతారు...ఇంకొంతమందికి....విమానం ల్యాండ్ అయ్యేటపుడు ఇక మాటలు రావు..అంత భయపడతారు. అలాంటిది మీరు విమానంలో వెళ్తుండగా విమానం పై కప్పు ఎగిరిపోతే...మీ పరిస్థితేంటి? 


దెబ్బకు విమానం ఎక్కడం మానేస్తారు...  ఇలాంటి ఇన్సిడెంట్ ఓ మహిళా పైలట్‌( lady pilot) కు ఎదురయ్యాయి. అయినప్పటికీ ధైర్యం కోల్పోని ఆమె విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. కంటి చూపు తిరిగి సాధారణ స్థితికి రావడానికి ఆమెకు 28 గంటల సమయం పట్టిందట.. ఎంత గాలి మరి ...అసలు సేఫ్ కు నేల మీదకు రావడమే పెద్ద టాస్క్ ..నెదర్లాండ్స్‌కు చెందిన మహిళా పైలట్ నరైన్ మెల్కుమ్జాన్ రెండేళ్ల క్రితం ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం జరిగిందని .. తాజాగా ఎక్స్‌లో పంచుకుంటూ ఆ వీడియోను షేర్ చేసుకున్నారు.


 ‘‘విమాన విన్యాసాల్లో అది నా రెండో ప్రయాణం. నేను నడుపుతున్న ‘ఎక్స్‌ట్రా 330ఎల్ఎక్స్’ ( extra 330 lx) విమానం గాల్లో ఉండగా దాని పైకప్పు తెరుచుకుంది. టేకాఫ్‌కు ముందు సరిగ్గా చెక్ చేసుకోకపోవడమే ఇందుకు కారణం. కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకోండా శిక్షణకు వెళ్లడం కూడా నేను చేసిన మరో తప్పు. కంటికి అద్దాలు లేకపోవడం, ఓ వైపు విమానం నుంచి వచ్చే భారీ శబ్దం, ఇంకోవైపు సరిగా చూడలేని, శ్వాస తీసుకోలేని పరిస్థితి. ఒక్కటి కాదు...ఆరోజు నేను నిజంగా అనుకున్నా...నా చావుకు మూహూర్తం ఫిక్స్ అయ్యిందని ..ఎలాగో దేవుడు కాపాడి నేల మీదకు చేర్చాడంటు వీడియో షేర్ చేశారు.


ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. అసలు ఇలాంటి కథ నాకు కలలో వస్తుంటాయని...ఇది నిజంగా పునర్జన్మ అని కామెంట్లు చేస్తున్నారు.