Police station: పోలీస్ స్టేషన్ లో ఖైదీని ఇంత దారుణంగా చేస్తున్నారా !

ఇక్కడ మాత్రం ఖైదీ కాళ్లకు గొలసులతో తాళం వేసి పోలీస్ స్టేషన్ లో పనులు చేయించుకుంటున్నారు.


Published Mar 11, 2025 02:24:00 PM
postImages/2025-03-11/1741683582_351547whatsappimage20230802at114802am.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ :  పోలీస్ స్టేషన్  అనగానే ఖైదీలను దారుణంగా చూస్తారని అందరికి తెలుసు. కాని మరీ ఇంత దారుణంగా చూస్తారని తెలీదు. రీసెంట్ గా నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి కాళ్లకు సంకెళ్లతో కనిపించాడు. సాధారణంగా నేరస్థులకు పోలీస్ స్టేషన్ కు వచ్చాక సెల్ లో వేసి తాళం వేస్తారు. కాని ఇక్కడ మాత్రం ఖైదీ కాళ్లకు గొలసులతో తాళం వేసి పోలీస్ స్టేషన్ లో పనులు చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది.

 నిందితుడితో స్టేషన్ ను క్లీన్ చేయాలని చెప్పడంతో చీపురు పట్టుకుని మెల్లిగా నడుస్తూ సదరు నిందితుడు ఊడ్వడం వీడియోలో కనిపిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనను రికార్డు చేసి సోషల్ మీడియా లో అప్ లోడ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతుంది. చిన్న చిన్న కేసుల్లో అరెస్ట్ అయిన వారితో ఇలా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కాళ్లకు సంకెళ్లు వేసి మరీ పనిచేయించుకోవడం అమానుషమని విమర్శిస్తున్నారు.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news -police-

Related Articles