viral : రీల్స్ కోసం రైలు కు వేలాడిన వ్యక్తి !


ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో ని కాస్గంజ్ - కాన్పూర్ స్టేషన్ల మధ్య జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Published Mar 11, 2025 05:49:00 PM
postImages/2025-03-11/1741695590_52159.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రాణాలంటే లెక్క లేదు...ఫేమస్ అయిపోవాలి..యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేయాలి. ఇదే యూత్ మైండ్ లో ఉంది. రీల్స్ తీసుకోవడం కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటున్నారు. రీల్స్ కోసం సాహసాలు చేస్తున్నారు చాలామంది. తాజాగా కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ ఓ యువకుడు ప్రమాదకర స్టంట్ చేశాడు. 


ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో ని కాస్గంజ్ - కాన్పూర్ స్టేషన్ల మధ్య జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 1:10 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో, తనతో పాటు ప్రయాణిస్తున్న ప్రయాణికుడి చేయి 56 సెకన్ల పాటు పట్టుకొని వేగంగా దూసుకుపోతున్న రైలు నుంచి బయటకు వేలాడుతూ కనిపించాడు.  ఎవరో గొలుసు లాగడం వల్ల రైలు ఆగడంతో ఆ యువకుడు కిందపడి గాయపడ్డాడు. వెంటనే అతను లేచి రైలు ఎక్కాడు. ఈ ఘటనతో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu reels socialmedia

Related Articles