ఇలాంటిదే డార్జిలింగ్‌లోని కుర్సియాంగ్ డివిజన్‌లోని బాగ్డోగ్రా అడవుల్లో ఏనుగు మృతదేహం కనిపించడంతో అక్కడ కలకలం చెలరేగింది. రెండు ఏనుగులకు ఎందుకు గొడవ వచ్చిందో భీకరంగా కొట్టుకొని ..ఓ ఏనుగు చనిపోయింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అడవిలో జంతువులు ...ఎప్పుడు స్నేహంగానే ఉంటాయా ఏంటి...సరదా సరదాగా కొట్టుకుంటాయి..లేదా ..మరీ తిక్క రేగితే ..చంపేసుకుంటాయి. అడవిలో బతికే ..జంతువులకు ఇది చాలా కామన్. ఇలాంటిదే డార్జిలింగ్‌లోని కుర్సియాంగ్ డివిజన్‌లోని బాగ్డోగ్రా అడవుల్లో ఏనుగు మృతదేహం కనిపించడంతో అక్కడ కలకలం చెలరేగింది. రెండు ఏనుగులకు ఎందుకు గొడవ వచ్చిందో భీకరంగా కొట్టుకొని ..ఓ ఏనుగు చనిపోయింది.
డార్జిలింగ్‌లోని కుర్సియాంగ్ డివిజన్‌లోని బాగ్డోగ్రా అడవుల్లో మక్నా ఏనుగు (దంతాలు లేని మగ ఏనుగు) మృతదేహం లభ్యమైందని ఒక అధికారి తెలిపారు. అసిస్టెంట్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (SDFO) రాహుల్ దేబ్ ముఖర్జీ ప్రకారం, ఒక ఏనుగు, మక్నా ఏనుగు మధ్య పోరాటం జరిగింది. ఆ తరువాత అడవిలో ఒక ఏనుగు చనిపోయి కనిపించింది.
రెండు జంతువుల మధ్య వివాదం ఒక ప్లేస్ కోసం వస్తుంది. కారణం ఏదైనా ఆ పోరాటంలో మక్నా ఏనుగు కూడా గాయపడింది. బాగ్డోగ్రా అడవిలో మక్నా ఏనుగుల మధ్య పోరాటం జరిగిందని SDFO తెలిపింది. ఏనుగు స్థానికమైనది. అయితే మక్నా ఏనుగు చుట్టుపక్కల అడవుల నుండి వచ్చి ఉంటుంది. పోరాటం తర్వాత మక్నా ఏనుగు తీవ్రంగా గాయపడి చాలా రక్తాన్ని కోల్పోయిందని చెప్పారు. ఆదివారం ఉదయం పారెస్ట్ రెస్క్యూ టీం ఏనుగు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన తర్వాత అటవీ అధికారులు ఈ పోరాటంలో పాల్గొన్న మరీ ఏనుగును క్లియర్ పరిక్షిస్తున్నారు. అటవీ శాఖ విచారం వ్యక్తం చేస్తూ, గాయపడిన ఏనుగును మేము రక్షించలేకపోయామని తెలిపింది. పోస్టుమార్టం తర్వాత ఏనుగును దహనం చేస్తారు.