పిల్లల గ్రోత్ పెరగాలంటే  బెల్లం చపాతి ఎంతో మేలు.!

న్యూస్ లైన్ డెస్క్:ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలు ఆహారం తినాలంటే, మారం చేస్తూ ఉంటారు. వారి నాలుకకు రుచిగా ఉంటే ఏదైనా లాగించేస్తారు. ఆ విధంగా  పిల్లల గ్రోత్ అద్భుతంగా పెరగాలంటే ఈ ఫుడ్ మంచిదని  అంటున్నారు. అదే బెల్లంతో తయారుచేసిన 'గుర్ కి రోటి'.  మరి దీన్ని ఎలా తయారు చేయాలి. 

 కావలసిన పదార్థాలు:
 రెండు కప్పుల గోధుమపిండి, ఒక కప్పు మజ్జిక, అరకప్పు బెల్లం తురుము, కావలసినంత ఉప్పు, రెండు స్పూన్ల నెయ్యి కావాలి. 

 తయారు చేసే విధానం :
 గోధుమపిండిని  ఒక గిన్నెలో తీసుకొని చిటికెడు ఉప్పు, ఒక స్పూన్ నెయ్యి, ఒక కప్పు మజ్జిగ వేసి బాగా కలపాలి. దీన్ని చపాతి పిండిలా బాగా కలుపుకొని  పైన కాసేపు మూత పెట్టి ఉంచాలి. పావుగంట తర్వాత దాన్ని చేత్తో ఒత్తుకోవాలి.  ఆ తర్వాత బెల్లం తురుము చల్లుకొని, మళ్లీ చపాతీని మడత పెట్టి ఒత్తాలి. స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి రాసి ఆ చపాతిని రెండువైపులా కాల్చాలి. దీంతో అద్భుతమైన టేస్టు కలిగినటువంటి బెల్లం తురుము చపాతి రెడీ అయినట్టే


Published Jun 23, 2024 10:29:51 PM
postImages/2024-06-23/1719161991_chapathi.jpg

ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలు ఆహారం తినాలంటే, మారం చేస్తూ ఉంటారు. వారి నాలుకకు రుచిగా ఉంటే ఏదైనా లాగించేస్తారు. ఆ విధంగా  పిల్లల గ్రోత్ అద్భుతంగా పెరగాలంటే ఈ ఫుడ్ మంచిదని  అంటున్నారు. అదే బెల్లంతో తయారుచేసిన 'గుర్ కి రోటి'.  మరి దీన్ని ఎలా తయారు చేయాలి. 

newsline-whatsapp-channel
Tags : news-line chapathi bellam health

Related Articles