దీంతో కోర్టు ఆ దంపతుల కుమారుడి బాధ్యతలను భర్తకు అప్పగించింది. తల్లికి ఆ బిడ్డను అప్పుడప్పుడు కలిసే అవకాశాన్ని కల్పించింది
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: కన్నతల్లి తన బిడ్డను చంపేయడం అనే మాటే ...గుండె పగిలిపోతుంది. ఊహించలేనంత భయంకరమైన విషయం కాని ఓ కన్నతల్లి తన బిడ్డను కడతేర్చిన దారుణమైన ఘటన కాలిఫోర్నియా లో జరిగింది. భారత సంతతికి చెందిన ఓ మహిళ ల11 ఏళ్ల కొడును చంపేసింది. అసలు ఏం జరిగిందంటే ...
48 ఏళ్ల సరితా రామరాజు 2018లో భర్త నుంచి విడిపోయారు. దీంతో కోర్టు ఆ దంపతుల కుమారుడి బాధ్యతలను భర్తకు అప్పగించింది. తల్లికి ఆ బిడ్డను అప్పుడప్పుడు కలిసే అవకాశాన్ని కల్పించింది. ఆమె వర్జీనియాలో నివసిస్తుంది.కాలిఫోర్నియాలోని శాంటా అనాలో ఓ హోటల్ రూమ్ తీసుకుంది. కుమారుడితో సరదాగా గడిపేందుకు డిస్నీ ల్యాండ్ లో పాస్ లను కూడా తీసుకుంది.
మార్చి 19 బాబుని తిరిగి తండ్రికి అప్పగించాల్సి ఉంది. తండ్రికి పిల్లాడిని ఇవ్వడం అసలు ఇష్టం లేని సరిత అదే రోజున ఉదయం 9:12 గంటలకు స్థానిక పోలీసులకు ఫోన్ చేసి, తాను తన కుమారుడిని చంపి, ఆత్మహత్య చేసుకోనున్నట్లు వెల్లడించింది. దీనితో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. కానీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికే బాలుడు మృతి చెందాడు. కొడుకును కత్తితో పొడిచి చంపేసి తను పొడుచుకుంది. హాస్పటిల్ కు తరలించారు పోలీసులు. అయితే బాలుడు అక్కడే మృతి చెందారని తెలిపారు.