France: ఫ్రాన్స్ లో 1,300 ఏళ్ల నాటి ‘మాయా ఖడ్గం’ మాయమైపోయిందట!

Published 2024-07-04 14:49:28

postImages/2024-07-04//1720084768_durandal17200686113201720068618449.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ప్రపంచంలో కెల్లా అత్యంత పదునైందిగా.. అసలు నాశనమే కానిదని ఆకత్తికి పేరు ఉంది.  ఫ్రాన్స్ లో  అత్యంత  పురాతన ఫ్రెంచ్ ఖడ్గం అదృశ్యమైంది. రోకమడోర్ అనే పట్టణంలో 1,300 ఏళ్లుగా ఓ 100 అడుగుల ఎత్తయిన బండరాయిలోకి సగం దిగబడిన కత్తి చోరీకి గురైనట్లు స్థానికులు భావిస్తున్నారు. 


అయితే 100 అడుగుల ఎత్తుకు ఎక్కి ఆ ఖడ్గాన్ని దొంగిలించడం ఎలా సాధ్యమో అంతుబట్టక తలలుపట్టుకుంటున్నారు అధికారులు. ఇప్పటివరకు ఈ టూరిస్ట్ స్పాట్ కు ఇదే చాలా స్పెషల్ అట్రాక్షన్. వంద ఏళ్లుగా తమ పట్టణ చరిత్రతో ఈ కత్తి చరిత్ర కూడా ముడిపడి ఉంది. డురండల్ గా పిలిచే ఆ ఖడ్గానికి ఫ్రెంచ్ ఎక్స్ క్యాలిబర్ అని కూడా పేరుంది. స్థానిక స్థల పురాణం ప్రకారం ఆ ఖడ్గానికి అతీంద్ర శక్తులు ఉన్నాయి. ఒక్క వేటుతో రాతిని కూడా అది రెండుగా చీల్చగలదట. అలాంటి ఖడ్గాన్ని ఎలా దొంగిలించారో అంతుచిక్కడం లేదు.


8వ శతాబ్దంలో ఆ ఖడ్గాన్ని ఓ దైవదూత నాటి రోమన్ చక్రవర్తి చార్ల్ మేగ్నెకి అందించింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ఆ ఖడ్గాన్ని తన అత్యుత్తమ సైనికుడైన రోలాండ్ కు బహూకరించారు. అయితే యుద్ధంలో మరణించే ముందు రోలాండ్ ఆ ఖడ్గం శత్రువుల చేతికి చిక్కరాదని భావించి దాన్ని విరగొట్టాలనుకున్నాడు. కానీ అది సాధ్యంకాకపోవడంతో అసహనానికి లోనై దాన్ని గాల్లోకి విసిరాడు. దీంతో ఆ కత్తి గాల్లో కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి చివరకు రొకమడోర్ పట్టణంలోని రాతికొండలో దిగబడిందని చరిత్ర చెబుతుంది.11వ శతాబ్దం నాటి ఫ్రెంచ్ సాహిత్యంలోనూ డురండల్ మాయాశక్తుల ప్రస్తావన ఉంది.  ఈ ఖడ్గం కాని తిరిగి దొరకకపోతే  రోకమడోర్ ప్రాంతం వందేళ్ల చరిత్ర పోయినట్లే.