తన ప్రేమ కోసం ఐదేళ్ల నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచమైన వ్యక్తి కోసం దేశం దాటి వచ్చి మరి పెళ్లి చేసుకుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రేమ అందమైన అనుభూతి. అవసరాల కోసం ప్రేమించే వారు కొందరైతే..ప్రాణంగా ప్రేమించేవారు కొందరు. ఎలా అయితే ప్రేమ వెయ్యి రకాలో మనుషులు కూడా వెయ్యి రకాలు. కొన్ని ప్రేమలు సరిహద్దులు దాటి విస్తరిస్తాయి.అలాంటి ప్రేమ కథే ఈ నేపాలీ అమ్మాయి ప్రేమ కథ. తను ప్రేమించిన అబ్బాయి కోసం ఇండియాకు వచ్చింది. ఇందులో స్పెషల్ ఏంటి ..అంటారా ..ఆ అబ్బాయి ఓ దివ్యాంగుడు. కాళ్లు చేతులు లేవు . అయినా తన ప్రేమ కోసం ఐదేళ్ల నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచమైన వ్యక్తి కోసం దేశం దాటి వచ్చి మరి పెళ్లి చేసుకుంది.
ఝార్ఖండ్‌లోని ఝార్ఖండ్‌లోని పలామా జిల్లా సత్బర్వా ప్రాంతంలోని తాబర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ ఆరిఫ్ కు చేతులు, కాళ్లు లేవు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తుంటాడు. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అయితే నేపాల్ కు చెందిన భూమికా విశ్మకర్మ నెయిల్ ఆర్టిస్ట్ గా పని చేస్తుంది. నెలకు రూ.20-25 వేల వరకు వస్తాయి. అయితే ఐదు నెలల క్రితం ఇన్స్ స్టా లో పరిచయం అయ్యింది. ఆరిఫ్ తో భూమికా కు పరిచయం ఏర్పడింది. ఈ స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఆరిఫ్ కోసం భూమికా నేపాల్ నుంచి ఇండియా కు వచ్చేసింది. కుటుంబసభ్యులతో మాట్లాడి ఆరిఫ్ ను పెళ్లి చేసుకుంది. చాలామంది తనకు నచ్చజెప్పారని ఈ పెళ్లి పెద్దగా కుదరదని చెప్పినా తను వినలేదని పెళ్లి చేసుకొని తన పేరును అఫ్సానాగా మార్చుకుందని తెలిపారు.