industry : టిఫెన్ సెంటర్ నడుపుతున్న...నటి ..ఎన్నో సినిమాల్లో చేసినా కష్టాలు తప్పలేదు

Published 2024-07-04 05:32:24

postImages/2024-07-04/1720087558_images1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సినిమా టీవీ అనే రంగుల ప్రపంచం...అందమే పెట్టుబడి...అవకాశాలే అన్నం...నీ టైం బాగుందా ..టక్కున అవకాశాలు అందుతాయి. లేదంటే కూటికి కూడా లేకుండా రోడ్డున పడతారు. సెక్యురిటీ లేని ఫీల్డ్. ఎన్ని కష్టాలున్నా..తమను తాము స్క్రీన్ మీద చూడాలనుకుంటారు. కానీ ఎన్నో సీరియల్స్ నటించి...అడపాదడపా  సినిమాల్లోనూ అవకాశాలు పొందిన కాలం కలిసిరాని ఓ యాక్టర్ ఉన్నారు. అనుకున్న అవకాశాలు రాక...హైదరాబాద్ లో రోడ్డున పడలేక...సొంతూరికి చేరుకొని టిఫెన్ సెంటర్ పెట్టుకొని బతుకుతుంది.


బుల్లి తెర నటి తాటి గీత. పదుల సంఖ్యలో సీరియల్లో నటించి, అడపాదడపా సినిమాల్లోనూ ఛాన్స్‌లు దక్కించుకున్న ఆమె...ఇప్పటికీ తమ సొంత ఊరిలో రోడ్డుపక్కన చిన్న బండిపై హోటల్‌ నడుపుతున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌ కు చెందిన తాటిగీత బుల్లితెరపై ఎన్నో సీరియల్స్‌లో నటించింది. గృహప్రవేశం,మనసు మమత, నిన్నే పెళ్లాడుతా, గుప్పెడంత మనసు, నాలుగు స్తంభాలాట, రాధమ్మ కూతురు వంటి సీరియల్స్‌లో నటించింది. నకిరేకల్‌లో రామకృష్ణ, వెంకటేశ్వర థియేటర్ల మధ్యలో గీత వాళ్ల ఇల్లు ఉండేదట...థియేటర్ కు వచ్చిన జనాలు విజిల్స్, ఇవన్నీ చూడడం వల్ల తనకి సినిమాలంటే మోజు పెరిగింది. దీంతో టిక్ టాక్ , డబ్ స్మాష్ లు చేసి ..అక్కడ నుంచి సినిమా ప్రయత్నాలు చేసిందట గీత. అనుకున్నట్లే అవకాశాలు వచ్చాయి.


మహర్షి , బగవంత్‌ కేసరి , గేమ్ చేంజర్‌ వంటి చిత్రాల్లోనూ నటించింది . తమసోమ జ్యోతిర్గమయ, యద్భావం తద్భవతి, బీమదేవరపల్లి బ్రాంచ్‌, ప్రేమ వివాహం, లగ్గం, ట్రెండింగ్‌ లవ్‌స్టోరీ వంటి చిత్రాల్లోనూ నటించింది. చిన్న సినిమాల్లో హీరో , హీరోయిన్లకు తల్లి పాత్రలు కూడా చేసింది. అయినా  ఏం లాభం లేదు...పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీంతో చేసేది లేక సొంతూర్లో టిఫెన్ సెంటర్ పెట్టుకొని కాలం గడుపుతుంది.
వేషాలు రాకపోయినా హైదరాబాద్‌లోనే ఉంటూ కష్టాలుపడటం కన్నా....తనకు ఎంతో అలవాటైన ఈ పని చేసుకోవడం సుఖంగా ఉందంటోంది. హైదరాబాద్‌ కు చాలా దగ్గరే కాబట్టి...ఎవరైనా వేషం ఉందని పిలిస్తే వెళ్లి నటించి వచ్చేస్తానంటోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Geetha Thati (@thatigeetha)