న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు లైంగిక వేధింపులు ఎదురైతే అంతర్గత కమిటీలో విచారణ చేసి , భాద్యులపై చర్యలు తీసుకునే అధికారముంది. టీజింగ్ , వేధింపులు చేస్తే ఉద్యోగుల పై చర్యలు తీసుకోవడానికి అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని గతేడాది మేలో పురపాలక శాఖ ఉత్తర్వ్యూలు జారీ చేసింది. ఈ విషయాన్ని చాలా పురపాలికలు పట్టించుకోవడం లేదు. కొన్ని సంఘటనల నేపథ్యంలో మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని పురపాలికల్లో ఈ అంతర్గత కమిటీలను ఏర్పాటు చేశారు.
2013లో అమలులోకి వచ్చిన ఈ చట్టంతో కమిటీలను ఏర్పాటు చేయడానికి పురపాలిక శాఖ 2024 మేలో ఉత్తర్వులు జారీ చేసింది.వారికి రక్షణగా అంతర్గత కమిటీలు వేయాలని సూచించారు.
ఈ కమిటీకి సీనియర్ మహిళా ఉద్యోగిని ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తారు.
పురపాలికలో సీనియర్ మహిళా ఉద్యోగి లేని చోట ఇతర ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఒక సీనియర్ మహిళా ఉద్యోగిని ఎంపిక చేసి, ప్రెసిడెంట్గా నియమిస్తారు. అలాగే మరో ఇద్దరు మహిళాలు ఉద్యోగులు కమిటీ మెంబర్లుగా ఉంటారు. వీరికి చట్టాలపై అవగాహన, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వారై ఉండాలి.మహిళా సమస్యలపై పోరాటం చేసే ప్రభుత్వేతర మహిళకు అవకాశం కల్పించాలి. మీకు ఎవరైనా లైంగికవేధింపులు చేస్తే ఈ కమిటీకి కంప్లెయింట్ చేసుకోవచ్చు.