Puran Kumar Sha: భారత్ జవాన్ ను చిత్రహింసలకు గురిచేసిన పాకిస్థాన్ !

21 రోజుల పాటు పాక్ నిర్భంధంలో ఉన్న ఆయనను ఎట్టకేలకు భారత్ కు అప్పగించింది పాకిస్థాన్.


Published May 15, 2025 11:42:00 AM
postImages/2025-05-15/1747289622_PKShaw1COL.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పంజాబ్ దగ్గర్లో అంతర్జాతీయ సరిహద్దు దగ్గర పొరపాటున పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించిన భారత సరహద్దు భద్రతా దళానికి చెందిన జవాన్ పూర్ణం కుమార్ షా పాక్ సైనికుల చేతిలో చిత్రహింసలకు గురైన విషయం రీసెంట్ గా వైరల్ అవుతుంది. 21 రోజుల పాటు పాక్ నిర్భంధంలో ఉన్న ఆయనను ఎట్టకేలకు భారత్ కు అప్పగించింది పాకిస్థాన్.


 పాకిస్థాన్ అధికారులు జవాన్ పూర్ణం కుమార్ షాను అదుపులోకి తీసుకున్న తర్వాత అత్యంత దారుణంగా వ్యవహరించారట. నిర్భంధంలో ఉన్నన్ని రోజులు ఆయన కళ్లకు గంతలు కట్టే ఉంచారట. నిద్రపోనివ్వవకుండా చాలా ఇబ్బంది పెట్టారట. అంతేకాదు పాక్ అధికారులు తనను తరచూ మాటలతో దూషిస్తూ , మానసికంగా వేధించినట్లు కూడా తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మూడు వారాల పాటు నరకం చూసినట్లు ఆయన తెలిపారు.


అంతర్జాతీయ సరిహద్దు వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో షా పాకిస్థాన్ భూభాగంలోకి ఎలా వెళ్లారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే పాకిస్థాన్ అధికారులు ఒక భారతీయ సైనికుడి పట్ల వ్యవహరించిన తీరు చాలా బాధాకరం అని సాధారణ యుధ్ధ ఖైదీల విషయంలో కూడా అంతర్జాతీయ నిబంధనలను పాటించాల్సి ఉండగా పొరపాటున సరిహద్దు దాటిన జవాన్ పట్ల ఇలా ప్రవర్తించడం గమనార్హం. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu pakistan indian-soldier

Related Articles