బుధవారం కిలో వెండి ధర రూ.99,100 ఉండగా, గురువారం నాటికి రూ.2,320 తగ్గి రూ.96,780కు చేరుకుంది
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : దేశంలో బంగారం , వెండి ధరలు భారీగా తగ్గాయి. బుధవారం బంగారం 10 గ్రాములు ధర రూ.97,000 ఉండగా, గురువారం నాటికి రూ.2,040 తగ్గి రూ.94,960కు చేరుకుంది. దాదాపు ఈ వారం నాలుగు వేలకు దగ్గరగా తగ్గింది. బంగారం ధరతో పాటు వెండి కూడా తగ్గింది. బుధవారం కిలో వెండి ధర రూ.99,100 ఉండగా, గురువారం నాటికి రూ.2,320 తగ్గి రూ.96,780కు చేరుకుంది.
హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.94,960గా ఉంది. కిలో వెండి ధర రూ.96,780గా ఉంది. అయితే దేశంలో అన్ని ప్రధాన నగరాల్లోను ఇదే ధర నడుస్తుంది. బంగారం గ్రాము ధర 24 క్యారట్లు 9400 కాగా 22 క్యారట్ల బంగారం ధర 10 గ్రాముల మీద 2200 తగ్గింది .
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,08,000 వద్ద కొనసాగుతుంది.
ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.96,000 వద్దకు చేరింది.
చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,08,000 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు , కలకత్తాలో మాత్రం అసలు ధర మీద రెండు వేల రూపాయిలు తగ్గుతుంది.