ఇప్పుడు ఆ పాస్ మార్క్ ను 35 నుంచి 10 కి మార్చేశారు. పదోతరగతిలో 10 మార్కులు వస్తే చాలు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్ధుల ఉత్తీర్ణత మార్కులపై షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గతంలో పాస్ మార్కుల కోసం తెగ ఇబ్బందిపడేవారు. ఇప్పుడు ఆ పాస్ మార్క్ ను 35 నుంచి 10 కి మార్చేశారు. పదోతరగతిలో 10 మార్కులు వస్తే చాలు ..మీరు పది పాసైనట్టే. అందరికి కాదండోయ్ కేవలం కొందరికి మాత్రమే. ఎవరో ఏంటో చూద్దాం.
మెంటల్ రిటార్డేషన్ స్థానంలో మేథో వైకల్యంగా పేరు మార్చింది. అంతేకాకుండా పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ ఉత్తీర్ణత మార్కులు 35కు బదులుగా 10 మార్కులుగా మారుస్తూ ప్రకటన జారీ చేసింది. వీరికి మాత్రం కేవలం పది మార్కులు వస్తే ఒక్కో సబ్జెక్ట్ లో పది మార్కులు వస్తే చాలు.
అయితే ఆటిజం ఉన్నవాళ్లకి ..తన మేధోసంపత్తిని ఉపయోగించి రాసేవారిని బూస్టింగ్ గా ఉండడమే కాకుండా...వీరి పరిస్థితిని బట్టి పదో తరగతి పాసవ్వడం వారికి ఓ మెట్టు పైకి వెళ్లడమే అవుతుందని అన్నారు. దీని కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.