నెల రోజులకు పైగా ఈరోజు అంటే ఈ రోజు అంటూ కళ్ళకు కాయలు కట్టుకుని చూస్తూ ఉన్నవాళ్ళు చాలామందే ఉన్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏపీ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ఓ ప్రవచన కర్తకు కీలకమైన నామినేటెడ్ పదవి ఇచ్చింది. నెల రోజులకు పైగా ఈరోజు అంటే ఈ రోజు అంటూ కళ్ళకు కాయలు కట్టుకుని చూస్తూ ఉన్నవాళ్ళు చాలామందే ఉన్నారు. పదవి మీద ఏ మాత్రం ఆశలేని ఓ వ్యక్తి పదవి వెతుక్కుంటు వెళ్తే ఏం చేస్తారనేది జనాల చాలా ఆతృత గా ఎదురుచూస్తున్నారు.
ఈరోజు 62 మందితో కూడిన రెండో విడత నామినేటెడ్ పదవుల జాబితా విడుదలైంది. విడుదలైన వెంటనే తమ పేరు చూసుకునే ప్రయత్నాల్లో ఉన్న రాజకీయ నాయకులందరికీ రెండో నెంబర్ లో ఉన్న పేరు చూసి ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేరు అది. అయితే విద్యార్ధులకు నైతిక విలువలు పెంపొందించే ప్రభుత్వ సలహాదారుగా ఆ పదవి ఉంది. ఆ పదవి వల్ల తమ అవకాశాలు పోవని, తమకు కలిగే నష్టమేమీ లేదంటూ ఒక వైపు, మరొకవైపు చాగంటి కోటేశ్వరావు లాంటి వారు సమాజానికి ఇప్పుడు అవసరం కాబట్టి ఎవరు నోరు మెదపలేదు.
చాగంటి కోటేశ్వరరావు కి గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇదే పదవిని ఆఫర్ చేసింది. 2014 – 19 మధ్య కాలంలో ఆనాటి టిడిపి ప్రభుత్వం చాగంటిని ఈ బాధ్యతలు తీసుకోవాలని కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పినా చేస్తాను కానీ తనకు ప్రత్యేకంగా పదవేమీ వద్దంటూ సున్నితంగా తిరస్కరించారు. తనకు పదవి మీద ఏం మాత్రం ఆశలేదన్నారు . అయితే ప్రభుత్వం ఇచ్చే బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వెళ్ళకంజ వేయనంటూ అప్పట్లో చెప్పారు చాగంటి .