Aishwarya: ఐశ్వర్య రాయ్ కాపురంలో చిచ్చు పెడుతున్న సొంత మనిషి.?

బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ ల మధ్య విడాకులు మేటర్ గత కొద్ది రోజుల నుండి బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారుతుంది. అయితే ఈ జంట విడాకులు తీసుకోకపోయినప్పటికీ విడాకుల రూమర్స్ వినిపించడంతో ఏదో ఒక రోజు


Published Oct 07, 2024 03:45:00 PM
postImages/2024-10-07/1728292550_aish.jpg

న్యూస్ లైన్ డెస్క్: బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ ల మధ్య విడాకులు మేటర్ గత కొద్ది రోజుల నుండి బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారుతుంది. అయితే ఈ జంట విడాకులు తీసుకోకపోయినప్పటికీ విడాకుల రూమర్స్ వినిపించడంతో ఏదో ఒక రోజు సడన్గా వీళ్ళిద్దరూ విడాకులు అనౌన్స్ చేసి అందరికీ పెద్ద షాకిస్తారు అని భావిస్తున్నారు. అయితే ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ ల కాపురంలో చిచ్చు పెడుతుంది సొంత మనిషే అని తెలుస్తుంది.

ఇక ఆమె ఎవరో కాదు అభిషేక్ బచ్చన్ సోదరి ఐశ్వర్య రాయ్ ఆడపడుచు శ్వేతా బచ్చన్.. అభిషేక్ బచ్చన్ నీ ఐశ్వర్య రాయ్ పెళ్లి చేసుకోవడం ముందు నుండి శ్వేతా బచ్చన్ కి అసలు ఇష్టం లేదట.. దానికి కారణం ఐశ్వర్యరాయ్ కంటే ముందే నటి కరిష్మా కపూర్ ని అభిషేక్ బచ్చన్ గాఢంగా ప్రేమించారు. వీరిద్దరి ప్రేమ ఎంతవరకు వెళ్లిందంటే పెళ్లి వరకు.. అలా ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.

కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరి ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిపోయింది.అయితే అభిషేక్ బచ్చన్ తో కరిష్మా కపూర్ బంధం  తెగిపోయినప్పటికి ఇంట్లో వాళ్లకు మాత్రం కరిష్మా కపూర్ అంటేనే చాలా ఇష్టం. అలా తమ ఇంటి కోడలుగా కరిష్మా కపూరే కావాలి అని అభిషేక్ తల్లి, సోదరి ఇద్దరు పట్టు బట్టారట. కానీ అది కుదరలేదు.ఇక చివరికి అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ తో ప్రేమలో పడ్డప్పుడు కూడా అభిషేక్ తల్లి సోదరి ఇద్దరు ఐశ్వరరాయ్ ని ఇంటి కోడలుగా ఏకీభవించలేదు.

దాంతో ఇంట్లో కోడలుగా ఎంట్రీ ఇచ్చినప్పటినుండే ఆధిపత్య పోరు నెలకొంది.అయితే చాలా సంవత్సరాలు ఓపిక పట్టిన ఐశ్వర్య రాయ్ ఇక ఓపిక పట్టడానికి రెడీగా లేనట్టు తెలుస్తుంది. అందుకే భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అలా సొంత ఆడపడుచే ఐశ్వర్య రాయ్ కాపురంలో చిచ్చు పెడుతున్నట్టు తెలుస్తోంది

newsline-whatsapp-channel
Tags : newslinetelugu aishwarya-rai aishswaryaraiabhishek aishwaryaraidivorce amitab-bacchan abishek-bacchan

Related Articles