Baby Movie: వైష్ణవి భర్త స్టార్ డైరక్టర్ తమ్ముడని తెలుసా ?

సాయి రాజేష్‌ నిర్మించిన కలర్‌ ఫొటో సినిమాలో హీరో సుహాస్‌కు సీనియర్‌గా కనిపిస్తాడు. కాని పెద్దగా వర్కవుట్ కాలేదు.


Published Aug 17, 2024 01:00:39 AM
postImages/2024-08-17//1723874293_babymovievishavichaintanya.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: లాస్ట్ ఇయర్ సూపర్ డూపర్ హిట్టు కొట్టిన సినిమా బేబీ..7 కోట్లతో తీస్తే దాదాపు 90 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఇది.ఓటీటీలో కూడా అత్యధిక వ్యూయర్ షిప్ ఉన్న సినిమా బేబీ. అయితే బేబీ సినిమాలో వైష్ణవి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. గుర్తుందా ఆ వ్యక్తి టాలీవుడ్ స్టార్ డైరక్టర్ తమ్ముడని తెలుసా ...చాలా తక్కువ మందికే తెలుసు


ఈ ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీలో ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రలు పోషించారు.  7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ.90 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం విశేషం. వైష్ణవి హస్బండ్ క్యారక్టర్ లో కనిపించిన వ్యక్తి  డైరక్టర్ వశిష్ట తమ్ముడు. అతని పేరు మల్లిడి కృష్ణ. బేబీ కన్నా ముందే పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించాడు. ముఖ్యంగా బేబీ డైరెక్టర్‌ సాయి రాజేష్‌ నిర్మించిన కలర్‌ ఫొటో సినిమాలో హీరో సుహాస్‌కు సీనియర్‌గా కనిపిస్తాడు. కాని పెద్దగా వర్కవుట్ కాలేదు.


కల్యాణ్‌ రామ్‌తో బింబిసారాలాంటి బ్లాక్ బస్టర్‌ సినిమాను తెరకెక్కించిన మల్లిడి వశిష్టకి సోదరుడే ఈ కృష్ణ. సోషల్ మీడియా అకౌంట్ లో ఇప్పుడు కృష్ణ చాలా ఫేమస్ అయిపోయాడు. పిల్లాడు బాగున్నాడంటు పిక్ ను తెగ వైరల్ చేస్తున్నారు. అయితే స్టార్ హీరో విష్ణు ప్రియతో దిగిన పిక్స్ కూడా ఉన్నాయి. అయితే కొంతమంది బ్రదర్ కాదు కాని ఫ్రెండ్స్ రా అబ్బాయి అంటున్నారు. మరికొంతమంది వశిష్ట సోదరుడే అంటున్నారు. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news bimbisara vasista baby

Related Articles