బిగ్ బాస్ సీజన్ 8 మొదలై ఒక వారం గడిచిపోయింది. రెండో వారం కూడా ప్రారంభమై బిగ్ బాస్ షో చాలా ఆసక్తికరంగా సాగుతోంది. మొదటి వారంలో బెజవాడ బేబక్క ఎలిమినేషన్ ద్వారా బయటకు
న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 8 మొదలై ఒక వారం గడిచిపోయింది. రెండో వారం కూడా ప్రారంభమై బిగ్ బాస్ షో చాలా ఆసక్తికరంగా సాగుతోంది. మొదటి వారంలో బెజవాడ బేబక్క ఎలిమినేషన్ ద్వారా బయటకు వెళ్లిపోయింది. ఇక రెండోవారం కూడా హౌస్ అంతా రచ్చ రచ్చగా కొనసాగుతూ నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంలోనే ఒకరినొకరు కించపరచుకుంటూ నామినేషన్లు చేస్తున్నారు. ఇందులో కంటెస్టెంట్ సోనియా మాత్రం యాంకర్ విష్ణు ప్రియపై విపరీతమైనటువంటి కామెంట్స్ చేసింది.
విష్ణు ప్రియకు కనీసం బట్టలు ఎలా వేసుకోవాలో కూడా తెలియదని, ఆమె వల్ల మిగతా కంటెస్టెంట్లు డిస్ కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నారని అడల్ట్ జోక్స్ వేసింది. ఆమెను అసలు చూపించడం కోసమే బిగ్ బాస్ లోకి తీసుకువచ్చారనే విధంగా మాట్లాడింది. తనపై ఆమె చేసే కామెంట్స్ తన ఫ్యామిలీ చూస్తుందని, కానీ విష్ణు ప్రియకు ఫ్యామిలీ లేదని చాలా పర్సనల్ విషయాలను చెబుతూ వచ్చింది.
ఈ విధంగా విష్ణు ప్రియపై రకరకాల నిందలు వేయడంతో ఆ విషయం చాలా హాట్ టాపిక్ అయింది. అంతేకాకుండా విష్ణుప్రియ వల్ల కంటెస్టెంట్ ఆదిత్య ఓం డిస్ కంఫర్ట్ గా ఫీల్ అయ్యాడని అభయ్ నవీన్, నిఖిల్ కు సోనియా చెప్పింది. అయితే విష్ణుప్రియ బ్లౌజ్ మార్చుకొని జాకెట్ లో ఉంది. అయితే సడన్ గా విష్ణుప్రియ గదిలోకి వెళ్లిన ఆదిత్య ఓం తనని మొత్తం చూసేసారని, కానీ ఆయన డిస్ కంఫర్ట్ గా ఫీల్ అయి వణికిపోయి బయటకు వచ్చారని సోనియా చెప్పింది.
ఈ విధంగా విష్ణు ప్రియను టార్గెట్ గా తీసుకొని సోనియా పర్సనల్ అసస్మెంట్ చేయడంతో సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. పలువురు రివ్యూవర్లు కూడా సోనియా క్యారెక్టర్ ను తప్పు పడుతున్నారు. ఇతరుల విషయాల్లోకి ఆమె దూరడం తప్పని, అదిత్యా ఓం అసలు డిస్ కంఫర్ట్ ఫీల్ అయ్యానని ఆమెతో చెప్పాడా, విష్ణు ప్రియకులేని సిగ్గు సోనియాకు ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ తతంగం అంత డైరెక్ట్ లైవ్ లో ప్రసారమైంది తప్ప షోలో చూపిస్తారో లేదో తెలియదని కొంతమంది రివ్యూవర్లు తెలియజేస్తున్నారు.