gold: ప్రపంచంలో అతిపెద్ద బంగారు గని చైనాకు దొరికింది.. భారత్ లో ధరలు తగ్గుతాయా?

మైన్ ప్రపంచంలోనే అతి పెద్ద బంగారు నిక్షేపంగా పరిగణించబతున్న దక్షిణాఫ్రికా గని కంటే పెద్దది కావడం మరీ ఆశ్చర్యంగా ఉంది. 


Published Dec 01, 2024 11:14:00 AM
postImages/2024-12-01/1733032089_1414924chinafindworldlargestgo.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగారం పెట్టుబడే కాదు..దేశాలను ఏలే రారాజు కూడా. ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారు నిల్వలు కలిగి ఉంటాయో ...ఆ దేశేమే  అగ్రరాజ్యం. తను చెప్పిందే ఫైనల్ ...ఇప్పటి వరకు అమెరికా ఈ హోదాలో ఉంది . ఇఫ్పుడు అందరికి  షాక్ ఇస్తూ చైనాకు బంగారు గని దొరికిందనే వార్త అన్ని దేశాలను అతలాకుతలం చేస్తుంది. ఈ గోల్డ్ మైన్ ప్రపంచంలోనే అతి పెద్ద బంగారు నిక్షేపంగా పరిగణించబతున్న దక్షిణాఫ్రికా గని కంటే పెద్దది కావడం మరీ ఆశ్చర్యంగా ఉంది. 


ప్రపంచవ్యాప్తంగా ఉన్నఅన్ని గనుల్లో ఇదే పెద్ద గని అంటున్నారు చైనా వాళ్లు . అది కూడా రూ.7 లక్షల కోట్ల విలువైన భారీ బంగారు గని గుర్తించారు. ఈ గోల్డ్ మైన్ ప్రపంచంలోనే అతి పెద్ద బంగారు నిధి  దక్షిణాఫ్రికా గని ..ఇప్పుడు చైనా నిధి అంతకంటే పెద్దదంట.బంగారం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన వస్తువు. 


1,000 మెట్రిక్ టన్నుల ప్రీమియం బంగారు గనిని తాము తమ దేశంలో గుర్తించామని చైనా వెల్లడించింది. హునాన్ ప్రావిన్స్‌లోని పింగ్‌జియాంగ్ కౌంటీలో ఉన్న బంగారు గనిలో సుమారు ₹7 లక్షల కోట్లు (600 బిలియన్ యువాన్) విలువైన బంగారం ఉందని అంటున్నారు. దీంతో ఇప్పుడు ప్రపంచ గనుల నిర్వచనాలు మళ్లీ మారాయి.చైనాలో గుర్తించిన ఈ భారీ బంగారు గని రికార్డుల మోత మోగిస్తోంది. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business gold china

Related Articles