Deepika Padukone: బిడ్డకు జన్మనిచ్చిన దీపిక పదుకొణే..ఎంత క్యూట్..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే అంటే తెలియని వారు ఉండరు.  ఈమె 2018లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రన్ వీర్ సింగ్ ను  నవంబర్ లో పెళ్లి చేసుకుంది..  అలాంటి ఈమెకు ఏడేళ్ల తర్వాత సంతానం కలిగింది. దీపికా 


Published Sep 08, 2024 05:51:06 AM
postImages/2024-09-08/1725783458_deepikapadukone.jpg

న్యూస్ లైన్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే అంటే తెలియని వారు ఉండరు.  ఈమె 2018లో బాలీవుడ్ స్టార్ హీరో రన్ వీర్ సింగ్ ను  నవంబర్ లో పెళ్లి చేసుకుంది..  అలాంటి ఈమెకు ఏడేళ్ల తర్వాత సంతానం కలిగింది. దీపికా పడుకొనే రన్వీర్ సింగ్ దంపతులకు పండంటి ఆడపిల్ల పుట్టినట్టు తెలుస్తోంది.

కొంతకాలం నుంచి దీపికా పడుకొనే ఎప్పుడో డెలివరీ అయింది అంటూ అనేక వార్తలు వచ్చాయి.  ఆ వార్తలన్నీటికి చెక్ పెడుతూ తాజాగా దీపిక  ముంబైలోని వినాయక గుడికి వెళ్లి దర్శించుకుంది.  దీంతో ఆమె డెలివరీ వార్తలకు చెక్ పడ్డట్టు అయిపోయింది. అయితే ఈమె  వినాయక ఆలయంలో పూజ చేసిన తర్వాత నేరుగా  ముంబైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో డెలివరీ కోసం చేరిందట.

దీంతో ఆమెకు వైద్యులు  డెలివరీ చేసినట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం ఆమెకు ప్రైవేట్ ఆస్పత్రిలో పండంటి ఆడపిల్ల పుట్టిందని  వైద్యులు తెలియజేసారట. ఈ విషయాన్ని  దీపికా కుటుంబ సభ్యులు  అఫీషియల్ గా బయట పెట్టలేదు కానీ సోషల్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి.

newsline-whatsapp-channel
Tags : deepika-padukone newslinetelugu bolly-wood ranveer-singh deepika-pragnancy deepika-delivery

Related Articles