దేవర ప్రస్తుతం ఏ నోట చూసిన ఈ సినిమా గురించే వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ చిత్రం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అలాంటి దేవర చిత్రం సెప్టెంబర్ 27వ
న్యూస్ లైన్ డెస్క్: దేవర ప్రస్తుతం ఏ నోట చూసిన ఈ సినిమా గురించే వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ చిత్రం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అలాంటి దేవర చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తోంది. అలాంటి ఈ మూవీ బెనిఫిట్ షో గురించి తాజాగా అనేక వార్తలు వినిపిస్తున్నాయి.
బెనిఫిట్ షో కి సంబంధించి టికెట్స్ అధిక రేట్లకు అమ్ముడుపోతున్నాయట. ఇక బెనిఫిట్ షోకే ఇలా ఉంటే ఫస్ట్ షో ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి బెనిఫిట్ షో రేట్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..ప్రస్తుతం దేవర బెనిఫిట్ షోలకి తాకిడి ఎక్కువగా ఉందట. ఇప్పటికే దేవరా సినిమా టికెట్లు రేట్లు పెంచుకోవడానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పర్మిషన్ అందించాయి. రోజుకు 5 షోలకు పర్మిషన్ ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నాయి. దీంతో సెప్టెంబర్ 27 అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలు పడనున్నాయి.
దీంతో టికెట్ల కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగబడి పోతున్నారు. దీంతో ఈ బెనిఫిట్ షోలా టికెట్ ధరలు బయట 3000 నుంచి 8000 పైగానే పలికినట్టు తెలుస్తోంది. ఇదే కాకుండా ఇంకా ఎక్కువ ధర పలికే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు రేపో, మాపో బెనిఫిట్ షోలకు సంబంధించి థియేటర్ లిస్టు కూడా బయటకు రాబోతోంది. ఇదే కనుక రిలీజ్ అయితే మాత్రం ఇక రచ్చ మొదలైనట్టే.
ఇప్పటికే చాలా చోట్ల థియేటర్లలో ఫ్లెక్సీలు బ్యానర్లతో ఫుల్ గా నింపేశారు. థియేటర్ లోపల విసిరేయడానికి పేపర్లు కూడా రెడీ చేసుకుంటున్నారు.. కాబట్టి దేవర బెనిఫిట్ షోలకి థియేటర్ల వద్ద గందరగోళం ఏర్పడిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా దేవర మూవీ ఎన్టీఆర్ కెరియర్ ను మరింత మలుపు తిప్పే అవకాశం అయితే కనిపిస్తోంది.