కత్రినా కైఫ్ పాన్ ఇండియా హీరోయిన్ గా ఎంతో గుర్తింపు పొందింది. బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాలే కాకుండా పలు కమర్షియల్ యాడ్స్ సోషల్ మీడియాలో
న్యూస్ లైన్ డెస్క్: కత్రినా కైఫ్ పాన్ ఇండియా హీరోయిన్ గా ఎంతో గుర్తింపు పొందింది. బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాలే కాకుండా పలు కమర్షియల్ యాడ్స్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను మనుషులను చురగొన్న కత్రినా గురించి ఒక్క మాటలో చెప్పుకోలేం.
అలాంటి కత్రినా కైఫ్ తాజాగా ఒక విమానాశ్రయంలో తలుక్కున మెరిసింది. కానీ ఆమె చేతికి ఒక నల్లని ప్యాచ్ ధరించి ఉంది. క్యూట్ పాపకు నల్లని కాటుక ఎలా పెడతారో, ఆ విధంగానే ఎంతో అందంగా కనిపిస్తున్నా ఆమె చేతికి ఆ నల్లని ప్యాచ్ ధరించడంతో అది ఏంటని చాలామంది ఆరాతీస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆమె స్పెషల్ గా రెడీ అయి వెళ్తూ ఇలా ప్యాచ్ వేసుకొని కనిపించడంతో అది హాట్ టాపిక్ గా మారింది. అయితే కొంతమంది నెటీజన్లు ఇది కొత్త ఫ్యాషన్ అంటుంటే మరి కొంతమంది అది ప్యాషన్ కాదు డయాబెటిస్ ప్యాచ్ అని అంటున్నారు.
బ్లడ్ షుగర్ ను మానిటర్ చేయవచ్చని, రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుందని అందుకే బయటకు వెళ్ళినప్పుడు అవి ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ ప్యాచ్ వేసుకుంటారని అంటారు. దీని ద్వారా మన సెల్ ఫోన్ కు ప్రతి మూమెంట్ మెసేజ్ ద్వారా వస్తుందని, దీనివల్ల జాగ్రత్త పడవచ్చని కొంతమంది నేటిజెన్స్ అంటున్నారు.