కార్ క్లీనర్ నుంచి బెస్ట్ డాన్సర్ గా..లారెన్స్ కు లైఫీచ్చింది ఆయనేనా.?

ప్రస్తుతం ఇండియాలో  బెస్ట్ డాన్సర్లు అంటే చాలామందికి గుర్తుకొచ్చేది ప్రభుదేవా, సుందరం మాస్టారు ఆ తర్వాత ప్రభుదేవా మాత్రమే. ఇందులో ప్రభుదేవా సుందరం మాస్టారు అంటే సీనియర్ డ్యాన్స్


Published Sep 14, 2024 01:27:38 PM
postImages/2024-09-14/1726300658_chiru.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం ఇండియాలో  బెస్ట్ డాన్సర్లు అంటే చాలామందికి గుర్తుకొచ్చేది ప్రభుదేవా, సుందరం మాస్టారు ఆ తర్వాత ప్రభుదేవా మాత్రమే. ఇందులో ప్రభుదేవా సుందరం మాస్టారు అంటే సీనియర్ డ్యాన్స్ మాస్టర్లు, కానీ లేటెస్ట్ డాన్స్ మాస్టర్లలో  రాఘవ లారెన్స్ ఎంతో పేరు తెచ్చుకున్నారు..  అలాంటి ఆయన అంతటి స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారట.  కారు క్లీనర్ గా చేసి రాఘవ లారెన్స్ ఇంతటి స్థాయికి రావడానికి ఆ హీరోనే కారణమట. వారెవరు ఆ వివరాలు చూద్దాం..

ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బారాయుని దగ్గర కారు క్లీనర్ గా జాయిన్ అయినా రాఘవ లారెన్స్   ప్రస్తుతం ఇండియాలోనే బెస్ట్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఉన్నారు. ఆయన ఇంతటి స్థాయికి రావడానికి ఇద్దరు వ్యక్తులే ముఖ్యకారకులట. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్. రాఘవ లారెన్స్ బ్యాగ్రౌండ్ డాన్సర్ గా ఉన్న సమయంలో అతని డ్యాన్సును మెచ్చి రజనీకాంత్ అతనికి పదివేల రూపాయలతో  డాన్స్ మెంబర్షిప్ కార్డు కొన్నారట. అలా రజనీకాంత్ రెకమండేషన్ తో  ప్రభుదేవా సుందరం మాస్టర్ దగ్గర కొన్నాళ్లు అసిస్టెంట్ గా చేసినటువంటి ఆయన  చిరంజీవి ముఠామేస్త్రి సినిమాలో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా చేస్తున్న సమయంలో  అతని డ్యాన్స్ ను చిరంజీవి గమనించి  దగ్గరికి పిలిచి మాట్లాడాడట.

నా సినిమాలో నీకు కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇస్తానని చెప్పారట.  అలా నాలుగు సంవత్సరాల తర్వాత ఇచ్చిన మాట తప్పకుండా హిట్లర్ సినిమాలో రాఘవ లారెన్స్ కు కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇచ్చారట. దీంతో హిట్లర్ సినిమాలో అద్భుతమైనటువంటి కొరియోగ్రఫీ చేసి అందరి దృష్టిలో పడ్డాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరికీ కొరియోగ్రఫీ చేసి ఎంతో గుర్తింపు సాధించుకున్న ఈయన, ఆ తర్వాత నాగార్జున ద్వారా డైరెక్టర్ గా కూడా మారి తన టాలెంట్ నిరూపించుకుంటూ దూసుకుపోతున్నారు.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi rajinikanth news-line raghava-larens sundaram-master

Related Articles