ఇప్పుడు బంగారం 10 గ్రాములు 24 క్యారట్ల గోల్డ్ పై 330 రూ..తగ్గింది. దీంతో గడిచిన ఐదు రోజుల్లో 24 క్యారట్ల బంగారంపై రూ.1,370 తగ్గింది. మరో వైపు వెండి ధర కూడా దిగొస్తుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బంగారం ధరలు చాలా వేగంగా దిగొస్తున్నాయి. గత ఐదు రోజులుగా బంగారం , వెండి ధరలు తగ్గుతుండడంతో పాటు ..రాబోయే కాలంలోనూ భారీగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనావేస్తున్నారు. మంగళవారం ఉదయం నమోదైన వివరాలు ప్రకారం బంగారం ధర భారీగా తగ్గింది. ఇప్పుడు బంగారం 10 గ్రాములు 24 క్యారట్ల గోల్డ్ పై 330 రూ..తగ్గింది. దీంతో గడిచిన ఐదు రోజుల్లో 24 క్యారట్ల బంగారంపై రూ.1,370 తగ్గింది. మరో వైపు వెండి ధర కూడా దిగొస్తుంది.
ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉద్రిక్తత పరిస్థితులు సద్దుమణుగుతుండటంతో గత ఐదు రోజులుగా గోల్డ్ రేటు తగ్గుతూ వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు (31.10గ్రాములు) 3,015కి దిగొచ్చింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.81,850 కాగా.. 24 క్యారట్ల ధర రూ.89,290కి దిగొచ్చింది. అంటే గ్రాము బంగారం 22 క్యారట్ల పసిడి 8100 ధర..ఇదే 24 క్యారట్ల బంగారం ధర 9వేల దగ్గర ఉంది.హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,10,000 వద్ద కొనసాగుతుంది. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోను బంగారం ధర ఇలాగే ఉంది.